Wednesday, May 15, 2024
- Advertisement -

పెళ్లి గురించి ఆ రోజే ఎనౌన్స్ చేయ‌నున్న ప్ర‌భాస్‌..!

- Advertisement -

బాహుబలి సినిమా త‌రువాత యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ క్రేజ్ నేష‌న‌ల్ లేవ‌ల్లో పెరిగింది. బ‌హుబలికి ముందు ప్ర‌భాస్‌కు ఒక్క యాభై కోట్ల సినిమా కూడా లేదు.బ‌హుబ‌లి -2తో ఏకాంగా 1000 కోట్ల మార్కెట్‌ను అందుకున్నాడు ప్ర‌భాస్‌.ఇండియాలో అత్య‌ధిక క‌లెక్ష‌న్లు సాధించిన హీరోగా రికార్డు క్రియేట్ చేశాడు ప్ర‌భాస్‌. ఈ క్రేజ్‌తో బాలీవుడ్‌లో సినిమా చేయ‌డానికి కూడా రెడీ అయ్యాడు . బ‌హుబ‌లి త‌రువాత ప్ర‌భాస్ పెళ్లి చేసుకుంటాడ‌ని చాలామంది భావించారు ,కాని వెంట‌నే సాహో సినిమాతో బిజీ అయ్యాడు.సాహో సినిమా త‌రువాత అయిన ప్ర‌భాస్ పెళ్లి చేసుకుంటాడో లేదో అని అంద‌రిలో అనుమానం ఉంది.తాజాగా ప్ర‌భాస్ పెళ్లిపై ఓ వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది.

వ‌చ్చే నెల(అక్టోబ‌ర్‌) 23న ప్ర‌భాస్ పుట్టిన రోజు కావ‌డంతో ఆ రోజు సాహో సినిమా టీజ‌ర్‌తో పాటు ,ప్రభాస్ పెళ్లి గురుంచి కూడా ఎనౌన్స్ చేయ‌నున్నార‌ని స‌మాచారం.ఇప్ప‌టికే నాలుగుప‌దుల వ‌య‌స్సు ద‌గ్గ‌ర ప‌డ‌టంతో ప్ర‌భాస్ పెళ్లిపై అనేక గాసిప్స్ వినిపిస్తున్నాయి.గ‌తంలో ప్ర‌భాస్ పెళ్లిపై అనేక వార్త‌లు వెలువ‌డ్డాయి.హీరోయిన్ అనుష్క‌తో ప్ర‌భాస్ పెళ్లి అని అనేక వార్త‌లు వ‌చ్చాయి.ప్ర‌భాస్ భీమ‌వరంకు చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడ‌ని కొంత‌కాలం సోష‌ల్ మీడియా ఓ న్యూస్ వైర‌ల్‌గా అయింది.ఈ వార్త‌ల‌పై ప్రభాస్ ఎప్పుడు స్పందించ‌లేదు.మ‌రి పుట్టిన రోజైనా ప్ర‌భాస్ పెళ్లిపై స్పందిస్తాడో లేదో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -