Sunday, May 12, 2024
- Advertisement -

పవన్‌లానే ఎన్టీఆర్‌కి కూడా త్రివిక్రమ్ రాజకీయ పాఠాలా?

- Advertisement -

క్యాప్షన్ః ఎన్నికల బరిలోకి తారక్‌ని దించుతున్న త్రివిక్రమ్…ఫ్యాన్స్ రియాక్షన్స్

ప్రారంభదశలో పవన్ కళ్యాణ్‌కి రాజకీయ పాఠాలను ఓ స్థాయిలో నేర్పించాడు త్రివిక్రమ్. ఇదే విషయంపైన త్రివిక్రమ్‌కి మెగా ఫ్యామిలీ మెంబర్స్‌కి మధ్య ఇష్యూ కూడా అయింది. చిరంజీవికి వ్యతిరేకంగా పవన్ మారేలా అంతా త్రివిక్రమే చేస్తున్నాడని చిరంజీవి కుటుంబ సభ్యులు మండిపడ్డారు. 2014లో జనసేన లాంఛింగ్, సాంగ్ వ్యవహారం అంతా కూడా త్రివిక్రమే చూసుకున్నాడు. ఆ తర్వాత త్రివిక్రమ్‌పై విమర్శలు రావడంతో వెనక్కి తగ్గాడు. ఇప్పటికీ పవన్ ప్రసంగాల వెనకాల త్రివిక్రమ్ హస్తం ఉందన్న మాటలు వినిపిస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు పవన్-చిరంజీవి అంతా కలిసిపోవడంతో త్రివిక్రమ్ కూడా మెగా ఫ్యామిలీకి సన్నిహితం అయ్యాడు.

అయితే అజ్ఙాతవాసి అట్టర్ ఫ్లాప్ తర్వాత నుంచీ పవన్‌నే త్రివిక్రమ్‌ని అంతగా ఎంకరేజ్ చేయడం లేదన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా త్రివిక్రమ్‌ని దూరం పెట్టేశాడు.అయితే ఇదే టైంలో ఎన్టీఆర్ మాత్రం త్రివిక్రమ్‌కి రోజు రోజుకూ దగ్గరవుతూ ఉన్నాడు. వ్యక్తిగత విషయాల్లో కూడా సన్నిహితమవుతున్నారు. ఎన్టీఆర్ హావభావాలు, ఎన్నికల ప్రసంగాలను అధ్యయనం చేసిన త్రివిక్రమ్ అరవింద సమేతలో ఒక భారీ పొలిటికల్ ఎపిసోడ్ కూడా పెట్టాడని తెలుస్తోంది. అయితే ఈ రాజకీయాలు కేవలం సినిమాలకే పరిమితం కాకుండా నిజజీవితంలో కూడా రాజకీయాల దిశగా ఎన్టీఆర్‌ని ప్రేరేపించేలా త్రివిక్రమ్ ఏమైనా చేస్తున్నాడా అనుమానం ఇప్పుడు తారక్ తల్లితో పాటు కళ్యాణ్ రామ్‌లో కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆల్రెడీ చంద్రబాబు కోసం ప్రచారం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ టాలెంట్ చూసిన బాబు తన కొడుకు లోకేష్‌కి ఎక్కడ పోటీ అవుతాడో అని ఎన్టీఆర్‌ని పూర్తిగా తొక్కెయ్యాలని చూశాడు.

ఇక ఆ తర్వాత సినిమాల్లో నిలబడడం కూడా ఒక దశలో ఎన్టీఆర్‌కి కష్టమైంది. అయితే మొత్తానికి తన హార్డ్ వర్క్, సూపర్ టాలెంట్‌తో మళ్ళీ టాప్ రేంజ్‌కి వచ్చేశాడు. ఈ దశలో రాజకీయాలు వద్దే వద్దని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా చెప్తున్నారు. 2024 ఎన్నికల టైంలో చూసుకోవచ్చని ………ప్రస్తుతానికి అయితే సినిమాల మీద దృష్టిపెట్టి ఇంకా టాప్ రేంజ్ సినిమాలు తియ్యాలని తారక్ కుటుంబసభ్యులు కూడా కోరుకుంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ విషయంలో జరిగినట్టుగానే త్రివిక్రమ్ సావాసం కాస్తా ఎన్టీఆర్‌ని కూడా రాజకీయాలవైపు నడిపిస్తుందా? లేకపోతే పొలిటికల్ ఎపిసోడ్ అనేది కేవలం అరవింద సమేత సినిమా వరకే పరిమితం అవుతుందా అన్నది చూడాలి.

అరవింద సమేత సినిమాలో ఎన్టీఆర్ రాజకీయ ప్రసంగాలు, హై ఓల్టేజ్ రాజకీయాలు ఉంటాయన్న వార్తలు మాత్రం నందమూరి ఫ్యాన్స్‌ని ఓ స్థాయిలో ఎక్సైట్ చేస్తున్నాయి. రాజకీయ ప్రసంగాల విషయంలో ఎన్టీఆర్ ప్రతిభ అందరికీ తెలిసిన విషయమే కాబట్టి అరవింద సమేత సినిమాకు మాత్రం ఈ ఎపిసోడ్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అవుతుందనడంలో సందేహం లేదు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -