Monday, April 29, 2024
- Advertisement -

ఫ్యామిలీ ప్యాకులతో అసలుకే ఎసరు

- Advertisement -

కేసీఆర్ ను ఎదుర్కోవాలంటే తెలంగాణలోని బలమైన శక్తులు కావాలి. ఆ బలమైన శక్తులుగా కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ కలిసి మహాకూటమిగా అవతరించాలి. అలా అయినప్పుడే వాళ్లంతా కలిసి కారు జోరుకు బ్రేకులు వేయగలరు. కానీ వీళ్ల కూటమిలో ఇంకా సీట్ల పంపకాల పంచాయతీ తేలలేదు. టీడీపీ 30 సీట్లు కోరుతుంటే కాంగ్రెస్ 19 ఇస్తామంటోంది. నిన్నకాక మొన్న పురుడు పోసుకుని, క్షేత్రస్థాయిలో కార్యకర్తలను కూడా ఏర్పాటు చేసుకోలేని టీజేఎస్ 30 సీట్లు కోరుతుంటే హస్తం పార్టీ 3 లేదా 4 చాల్లే అని చెబుతోంది. అవి కూడా గెలవడం కష్టమేమో..? అని అనుమానిస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ పోటీ చేసే స్థానాల కంటే కేసీఆర్ ప్రధానంగా టీజేఎస్ పోటీ చేసే స్థానాలపై దృష్టి పెడతారు. ఎందుకంటే కొన్నాళ్లుగా కేసీఆర్ కంటిలో నలుసులా కోదండరామ్ వ్యవహరిస్తున్నారు. ఉద్యమకాలంలో అందరినీ వాడుకుని, అధికారం చేపట్టాక బంగారు తెలంగాణ పేరుతో కుటుంబపాలనకు తెరదీశారని, రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారని కోదండరామ్ విరుచుకు పడుతున్నారు. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ ఎన్ని స్థానాల్లో గెలిచిన కేసీఆర్ పెద్దగా పట్టించుకోరు. అవి దశాబ్దాల చరిత్ర కలిగిన పార్టీలు, కేడర్ ఉంది కనుక గెలుపు సహజమే అనుకుంటారు. కానీ కోదండరామ్ పార్టీకి పురుటిలో చావుదెబ్బ కొట్టేస్తే, ఇక తెలంగాణలో టీజేఎస్ ఎదగడం అనేది అసాధ్యం అనే స్ట్రాటజీతో కేసీఆర్ కాన్ సనట్రేషన్ అంతా టీజెఎస్ మీదే పెడతారు. కనుక వాళ్లకు 3 సీట్లు ఇస్తే సరిపోతుందని అని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక సీపీఐకి 4 లేదా 5 స్థానాలు అంటోది.

అయితే టీడీపీ, సీపీఐ, టీజేఎస్ మాత్రం కాంగ్రెస్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. దశాబ్దాల చరిత్ర, బలమైన కేడర్ ఉన్న తమకు కోరినన్ని సీట్లు ఇవ్వకుండా కాంగ్రెస్ నేతలు ఫ్యామిలీ ప్యాక్ లు తీసుకుంటున్నారని మండిపడుతున్నారు. ఒక కుటుంబం నుంచి ఒక టికెట్ అనకుండా భర్తకు, భార్యకు, అన్నదమ్ములకు, మరదళ్లకు, బావమరుదులకు, మేనళ్లలుకు అన్నట్టు హస్తం పాట్రీ సీట్ల పంపకాలు ఉండబోతున్నాయని మహాకూటమిలోని మిత్రపక్షాలు మండిపడుతున్నాయి. జానారెడ్డి తనతో పాటు తన కుమారుడికి టికెట్ కోరుతున్నాడు. కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌ తమకు 4 టికెట్లు కేటాయించాలంటున్నారు. ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి తనతో పాటు భార్యకు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నాడు. డీకే అరుణ,తనతో పాటు కూతురుని బరిలో దించుతోంది. పొన్నాల‌ లక్ష్మయ్య, ముఖేష్‌గౌడ్‌, అంజ‌న్‌కుమార్‌యాద‌వ్‌..గీతారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఇలా దాదాపు 25 మంది సీనియర్ నాయకులు తమ కుటుంబంలో 2 లేదా 3 లేదా 4 టికెట్లు కోరుతున్నారు. దీంతో ముందు హస్తం పార్టీలోనే ఐకమత్యం కరువైంది. ఇక వారు మహాకూటమికి సీట్లు సర్దుబాటు ఎలా చేస్తారో ? అర్ధం కాని పరిస్థితి. అందుకే కూటమిలోని పార్టీలు ఇది మహాకూటమా ? మహాఫ్యామిలీ ప్యాకా ? అని నిలదీస్తున్నారు. ఇలా అయితే కేసీఆర్ కుటుంబపాలనపై మాట్లాడే మనల్ని కూడా ప్రజలు కుటుంబ పాలన అనే నిలదీస్తారు కదా అని ప్రశ్నిస్తున్నారు. సో కూటమి కట్టకముందే చిత్తు అయిపోయేలా ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -