Wednesday, May 15, 2024
- Advertisement -

పాట పాడిన యంగ్ హీరో..!

- Advertisement -

ఎన‌ర్జీటిక్ స్టార్ అంటే మ‌న అంద‌రికి ఠ‌క్కున గుర్తు వ‌చ్చే పేరు రామ్‌.హీరో రామ్ ఎప్పుడు చాలా ఎనర్జీటిక్‌గా ఉంటాడు.అయితే రామ్ కెరీర్ మాత్రం ఒక హిట్ రెండు ప్లాప్‌లుగా సాగుతుంది.ఇక రామ్ ప్ర‌స్తుతం న‌టిస్తున్న హ‌లో గురు ప్రేమ కోస‌మే ద‌స‌రాకు విడుద‌ల కానుంది.అయితే ఈ సినిమాలో రామ్ చేత ఓ పాట పాడించాడు సంగీత ద‌ర్శ‌కుడు దేవీ శ్రీ ప్రసాద్‌. ఇప్ప‌టికే చాల‌మంది హీరోలు పాటులు పాడిన సంగ‌తి తెలిసిందే.

తాజాగా ఈ లిస్ట్‌లో హీరో రామ్ కూడా చేరిపోయాడు.త్రినాథ్ రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన హ‌లో గురు ప్రేమ కోస‌మే సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్‌ సినిమాను అక్టోబర్‌ 18న రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.మ‌రి ఈ సినిమాతో అయిన రామ్ మ‌రో హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -