Thursday, May 16, 2024
- Advertisement -

రామ్ కు ముందు జాగ్రత్త మరీ ఎక్కువైంది

- Advertisement -

యంగ్ ఎనర్జటిక్ హీరో రామ్ కు… ముందు చూపంటే ఏంటో భాగా తెలిసిపోయింది.అందుకే ఆచితూచి అడుగులు వేయడం మొదలు పెట్టాడు. శివం ఇచ్చిన స్ట్రోక్ కు భాగా డిస్ట్రబ్ అయిన మనోడు హరికథ విషయంలో మరీ హరీ కథా కాలక్షేపాల్లాంటివి చేయకుండా చేసిన సీన్లకు మరమ్మత్తులు చేసుకుంటున్నాడట.

ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ‘హరికథ’ సినిమా కు సంబంధించిన షూటింగ్ 70 శాతం ఇప్పటికే పూర్తయినా…  మళ్లీ వాటిని రీ షూట్ చేసే పనిలో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. తన పాత ట్రాక్ ను దృష్టిలో పెట్టుకుని… వచ్చే సినిమాను కొనేందుకు డిస్ట్రిబ్యూటర్లు పెద్దగా ఆసక్తి చూపించరనే టాక్ రావడంతో… పలువురి సలహా మేరకు…  ఇప్పటివరకు షూట్ చేసిన సీన్లను చూపించారట నిర్మాత స్రవంతి రవికిశోర్. వారి సలహాతోనే ఆ సీన్లను రీ షూట్ చేస్తున్నారని తెలుస్తోంది. మరి రీ షూట్స్ తో మరింత పాలిష్ అవుతున్న ‘హరికథ’… ఆడియెన్స్‌ను ఆకట్టుకోలేకపోతే యంగ్ హీరో కెరీర్ మరింత కష్టాల్లో పడుతుందనేది అందరికీ తెలిసిన విషయమే. అందుకే మనోడికి ముందు జాగ్రత్త మరీ ఎక్కువైంది .

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -