Wednesday, May 15, 2024
- Advertisement -

రజనీకి జరిగిందే…. నేడు చెర్రీకి జరుగుతోంది.

- Advertisement -

బయ్యర్లు బరితెగించేస్తున్నారా…. అనిపిస్తుంది లేకపోతే ఏంటి చెప్పండి. సినిమా తేడా కొడితే..హీరోల ఇంటికొచ్చి గొడవ చేయడమేంటి . ఇలాంటి ఇష్యూ కోలీవుడ్లో జరిగితే… రజనీ స్పందించాడని మిగతావారు పాజిటివ్ గా స్పందించమనడం ఎంత వరకూ కరెక్ట్ నిన్న రజినీకి జరిగింది. ఇపుడు చెర్రీకి జరగబోతోంది.

మ్యాటర్లో కొచ్చేద్దాం….

కోలీవుడ్లో జరిగిన రచ్చే…. టాలీవుడ్లోను జరగబోతోంది.భారీ మొత్తంలో కొనేసిన సినిమాలు కాసులు కురిపించడం లేదని… బయ్యర్లంతా నిర్మాతలు,హీరోల ఇంటి కొచ్చేస్తున్నారు.నిజానికి ఈ  కల్చర్ స్టార్ట్ అయింది కోలీవుడ్లోనే. అక్కడ ఒకే ఒక్క హీరో ఈ విషయంలో మెతక వైఖరి అవలంభించడంతో… అది మొత్తం పరిశ్రమనే చుట్టేసింది.తాము కొన్న సినిమా ఫ్లాపైతే  బయ్యర్లంతా హీరోలను  టార్గెట్ చేసేస్తున్నారు.దీంతో లాక్కోలేక పీక్కోలేక వివాదాలు. అలా ఓ కుప్పలా తయారయ్యాయి.లింగా ,కథానాయకుడు ,కొచ్చడయాన్  సినిమాలే దీనికి బెస్ట్ ఎక్జాంపుల్ . 

రజనీ చేసిన విధానంపై ఆమధ్యన కమల్ మండిపడ్డాడు.నష్టాలు వచ్చిన బయ్యర్లు…. లాభాలు వచ్చినప్పుడు ఎందుకు మనకు వాటా ఇవ్వలేదని కొశ్చన్ చేశాడు.అందుకు తాను రజనీ అవలంబిస్తోన్న  ఈ విధానాన్ని ధైర్యంగా విమర్శించాడు. ఇపుడు ఆ తంతు మన టాలీవుడ్ కు వచ్చింది. దీనికి అక్కడ రజనీ బలైనట్లు..చెర్రీ బలవ్వడానికి సిద్దమయ్యేలా ఉన్నాడు.  ‘బ్రూస్ లీ’, పరాజయంతో బాగా లాస్ అవుతున్న డిస్ట్రిబ్యూటర్స్ త్వరలో రామ్ చరణ్ ను కలవ బోతున్నారని తెలుస్తోంది. ‘బ్రూస్ లీ’ సినిమాకోసం బయ్యర్లు పెట్టిన పెట్టుబడిలో దాదాపు డబ్బై శాతం వరకూ డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోతున్నారని  ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.దీనితో డిస్ట్రిబ్యూటర్స్ అంతా రామ్ చరణ్ ను కలిసి రికవరీ విషయమై తేల్చుకునే పనిలో పడ్డారట.

‘బ్రూస్ లీ’ సినిమాకి మొదటిరోజు ఆంధ్రా మరియు తెలంగాణలో 12.66 కోట్లమేర షేర్ రాగా, రెండో రోజు కు నెగిటివ్ టాక్ స్ర్పెడ్ అవ్వడంతో 4 కోట్ల షేర్ కి పడిపోయింది. ఇలా ఒక టాప్ హీరో సినిమాకు సంబంధించి కలెక్షన్స్ ఇంత దారుణంగా డ్రాప్ కావడం ఎన్నడూ జరగలేదని ‘బ్రూస్ లీ’ బయ్యర్ల వాదన. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -