Thursday, May 16, 2024
- Advertisement -

పవన్ కళ్యాణ్ తో మాత్రమే ఆ పని చేస్తా : రవితేజ

- Advertisement -

యాంకర్ ప్రదీప్ హోస్టుగా కొంచం టచ్ లో ఉంటె చెప్తా అనే ప్రోగ్రాం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ షో ఇప్పటికే సక్సెస్ ఫుల్ అయింది. ఈ షోకి ప్రతి వారం సెలబ్రిటీస్ ని తీసుకొచ్చి.. వారి ప్రొఫషన్ గురించి, పర్సనల్ లైఫ్ గురించి ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియని విషయాలను రాబడతాడు.

ఈ క్రమంలో ఈ షోకి తాజాగా ఎనర్జిటిక్ హీరో మాస్ మహారాజ రవితేజ ని తీసుకొచ్చి సందడి చేశారు. ఇక రవితేజ సినిమాల్లో ఎంత ఎనర్జిటి గా అయితే ఉంటారో.. అలానే ఈ షోలో కూడా సందడి చేశారు. తనకి డల్ గా ఉండటం అంటే చాలా చిరాకు అని.. అసహ్యం అని అన్నారు. అలానే తనకి సినిమా ప్రపంచం తప్ప ఇంకేం తెలియదని తెలిపారు.

ఇక ప్రదీప్ మాట్లాడుతూ ట్రైన్ ఎక్కి ముంబై ఎందుకు పారిపోదాం అనుకున్నారు అని అడిగితే, వామ్మో మొత్తం ఇన్షర్మేషన్ లాగావు అని నవ్వుతు అన్నారు. అదేవిధంగా ఇప్పటికిప్పుడు మీరు ఒక స్టార్ తో ప్రేమగా నటించాలి అనుకుంటే ఎవరితో నటిస్తారు అని ప్రదీప్ అడిగితే.. వెంటనే పవన్ కళ్యాన్ అని చెప్పారు. ఇక ప్రదీప్ ఇచ్చిన డిఫరెంట్ టాస్క్ లని చేస్తూ షోలో రవితేజ సరదాగా ఎంజాయ్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -