Monday, May 13, 2024
- Advertisement -

రెగ్యులర్ చెకప్ కు కూడా రూమర్లు అవసరమా…?

- Advertisement -

ఈమధ్య వార్తలు చూడడానికి  సరైన సరుకు దొరకక పోవడంతో… బేస్ లెస్ న్యూస్ లను చాలా మంది సర్కులేట్ చేసేస్తున్నారు. దానికి బెస్ట్ ఎక్జాంపుల్.. వరుణ్ సందేష్  మ్యాటరే.ఈనెల 7వ తారీకున ఎంగేజ్ మెంట్ పెట్టుకున్న వరుణ్…. తన రెగ్యులర్ హెల్త్ చెకప్ లో భాగంగా… నేడు సోమాజిగూడలోని యశోదా హాస్పిటల్ కు వెళ్లాడు.

అయితే అతను హాస్పిటల్ కు రావడం  చూసిన కొందరు కుర్రాళ్లు…. తమ మీడియా మిత్రులకు వరుణ్ సందేష్ హాస్పిటల్ కు వచ్చాడు అని చెప్పి ఊరుకోకుండా… వరుణ్ కు డెంగ్యూ ఫీవర్ వచ్చినట్లుంది అందుకే వచ్చాడు అని అత్యుత్సాహం ప్రదర్శించారు..అది నిజమో కాదో కూడా తెలియని కొందరు  …. వరుణ్ కు లేని పోని డెంగ్యూని అంట గట్టేశారు.

విషయం తెలుసుకుని వెంటనే అలర్ట్ అయిన వరుణ్ సందేష్ తాను రెగ్యులర్ జనరల్ చెకప్ కే వచ్చాను తప్ప… తనకు ఎలాంటి ఆరోగ్య సమస్య లేదని వివరణ ఇచ్చు కోవల్సి వచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -