Sunday, May 19, 2024
- Advertisement -

ఇలియానా అదృష్టం: మరో సూపర్ ఆఫర్ దక్కింది..!

- Advertisement -

హీరోయిన్లలో ఇలియానా అంత అదృష్టవంతులు తక్కువమందే ఉంటారు. రెండో సినిమాలో నటించడంతో ఆమె దశ తిరిగింది. అక్కడ నుంచి ఎక్కడ తగ్గకుండా ఏడెనిమిదేళ్లు బండి లాగించింది. అయితే ఆమె కథ అయిపోయిందని అనుకుంటున్న సమయంలో కూడా చక్కటి ఆఫర్లు ఆమెకు దక్కుతూ వస్తున్నాయి.

ఇప్పుడు కూడా ఇలియానాకు మంచి మంచి ఆఫర్లు.. దక్కుతుండటమే విశేషం. తొలి సినిమా దేవదాసుతో కొంచెం గుర్తింపు వచ్చింది.. ఆ తర్వాత పోకిరితో తన దశ తిరిగిపోయింది. మూడో సినిమాకే కోటి రూపాయల క్లబ్ లో చేరిపోయింది. అంత పారితోషకం డిమాండ్ చేసే స్థాయికి ఎదిగింది.

 ఆ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు ఇలియానా టాలీవుడ్ , కోలీవుడ్ లలో టాప్ పొజిషన్లో కొనసాగింది, స్టార్ హీరోల పక్కన సినిమాల్లో నటిస్తూ.. కోటి రూపాయల పై మార్కు మొత్తాన్ని డిమాండ్ చేసే స్థాయికి ఎదిగింది. ఈ మధ్యకాలంలో ఏ హీరోయిన్ కూ దక్కనంత కాలం ఇలియానాకు ఆ టాప్ హోదా దక్కింది.  

ఆ తర్వాత తనంతకు తనే దక్షిణాదికి దూరం అయ్యింది. బాలీవుడ్ పై దృష్టి సారించింది. హిందీలో కూడా ఆమెకు బర్ఫీ లాంటి హిట్లు దక్కాయి. మంచి గుర్తింపు దక్కింది. అయితే ఆ తర్వాత కొన్ని ప్లాఫులు రావడంతో ఆమె కథ అంతే అనుకున్నారు.

అయితే ఇప్పుడు కూడా టాలీవుడ్ లో చేస్తే ఇలియానాకు మంచి ఆఫర్లున్నాయి. అవే కాదు.. ఇప్పుడు హిందీలో కూడా ఆమెకు మరో ఆఫర్ వచ్చింది. వరస హిట్ల మీద ఉన్న దర్శకుడు నీరజ్ పాండే ఇల్లీ బేబికి తన ‘రుస్తుం’ సినిమాలో అవకాశం ఇచ్చాడు. దీంతో ఇల్లీ మళ్లీ నక్కతోక తొక్కినట్టైంది! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -