Saturday, May 4, 2024
- Advertisement -

ఎన్టీఆర్ బ‌యోపిక్ నుండి శ‌ర్వానంద్ అవుట్‌?

- Advertisement -

సీనియ‌ర్ న‌టుడు ఎన్టీఆర్ జీవిత క‌థ‌ను ఆయ‌న త‌న‌యుడు హీరో బాల‌కృష్ణ సినిమాగా తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే.ఈ సినిమాకు క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.అందరు పేరున్న నటీనటులనే తీసుకురావడం ద్వారా రిచ్ నెస్ తీసుకొచ్చే విషయంలో రాజీ లేకుండా చూసుకుంటున్నాడు క్రిష్‌.ఇందులో శ‌ర్వానంద్‌కు కూడా ఓ రోల్ ఉంద‌ని,దాని కోసం క్రిష్ తనను సంప్రదించినట్టు ఇటీవలే శర్వానంద్ చెప్పిన సంగతి అందరికి గుర్తే.ఈ సినిమాలో ఎన్టీఆర్ యువ‌కుడిగా ఉన్న పాత్ర కోసం శర్వానంద్‌ను తీసుకుందాం అనుకుంటున్నాడు క్రిష్‌.

అయితే కార‌ణం ఏంటో తెలియ‌దు కాని ఈ బ‌యోపిక్ నుండి శర్వానంద్ త‌ప్పుకున్నాడ‌ని స‌మాచారం. వచ్చే ఏడాది ఎన్నికల సంవత్సరం కావడంతో ఈ సినిమాను పొలిటికల్ మైలేజ్ కోసం వాడుకుంటారు కాబట్టి అది తనకు ఇబ్బంది కలగవచ్చేమో అనే ఉద్దేశంతో శర్వా ఈ సినిమా నుండి త‌ప్పుకున్న‌ట్లు తెలుస్తుంది. సీనియ‌ర్ ఎన్టీఆర్ పాత్రలో క‌నిపించ‌నున్నాడు బాల‌కృష్ణ‌.ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి విడుద‌ల చేయ‌ల‌ని భావిస్తున్నాడు క్రిష్‌.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -