Sunday, May 19, 2024
- Advertisement -

ఎవ‌డ‌య్యా యాక్సిడెంట్ అని చెప్పింది.. పుకార్ల‌పై హీరో మండిపాటు

- Advertisement -

ఒక‌ప్ప‌టి కుటుంబ క‌థా హీరోగా గుర్తింపు పొందిన శ్రీకాంత్ ఇప్పుడు కొత్త త‌ర‌హా పాత్ర‌ల‌తో సినిమాల్లో బిజీగా ఉన్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టి పెళ్లి సందడితో హీరోగా మారి ఆ త‌ర్వాత విజ‌య‌వంత‌మైన సినిమాలు చేశాడు. రెండు దశాబ్దాలుగా న‌ట‌న‌లో ప్రత్యేకత క‌న‌బ‌రుస్తూ ఆ త‌ర్వాత ఆప‌రేష‌న్ సిరీస్‌ల సినిమాలు చేసి స్పెష‌ల్ విజ‌యాలు అందుకున్నాడు. ఇప్పుడు హీరోగా ప్ర‌య‌త్నించిన సినిమాలు విజ‌యవంతం కాలేదు. కానీ శ్రీకాంత్ ఇప్పుడు మ‌ళ్లీ కొన్ని ప్ర‌త్యేక పాత్ర‌ల్లో మెరుస్తూ బిజీగా ఉన్నాడు.

ఇప్పుడు కుటుంబాన్నంతా సినిమాల్లోకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడు. అయితే మొన్న శ్రీకాంత్‌కు యాక్సిడెంట్ అయ్యింద‌ని యూట్యూబ్‌, కొన్ని సోష‌ల్ మీడియాలో విప‌రీత‌మైన వార్త‌లు వ‌చ్చాయి. వాస్త‌వ‌మో కాదో తెలియ‌కుండా వాళ్లు రాసేసి ఆ కుటుంబాన్ని గంద‌ర‌గోళంలో ఉంచారు. త‌న‌కు ప్ర‌మాదం జ‌రిగింద‌ని యూట్యూబ్‌లో ప్ర‌చారాలు రావ‌డంతో శ్రీకాంత్ బంధువులు కంగారు ప‌డ్డారు. దీంతో శ్రీకాంత్ ఫోన్ల మీద ఫోన్లు వ‌చ్చేశాయి. ఎందుకు వ‌స్తోంద‌బ్బా.. ఏమైంద‌ని ఆరా తీస్తే కొన్ని యూట్యూబ్ చాన‌ల్స్ త‌న‌కు ప్ర‌మాదం జ‌రిగింద‌ని అవాస్త‌వ ప్ర‌చారం చేశాయ‌ని తెలిసింది.

కొన్ని ఛానల్స్‌లో శ్రీకాంత్‌కు బెంగుళూరులో తీవ్ర ప్రమాదం జరిగిందని, గాయాలతో కోమాలో ఉన్నట్టు.. తన కుటుంబం విషాదంలో మునిగింద‌ని పెద్ద పెద్ద టైటిల్స్ పెట్టేసి అప్‌లోడ్ చేశారు. జ‌ర‌గ‌ని దాని గురించి ఇంత చెప్ప‌డంపై శ్రీకాంత్ మండిప‌డ్డారు. అసలు నిజాలు నిర్ధారించుకోకుండా ఇష్టమొచ్చినట్టు ఎలా రాస్తారని శ్రీకాంత్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ ప్ర‌చారం చేసిన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ విధంగా సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం కావ‌డం త‌మ‌ను క‌ల‌చివేసింద‌ని చెప్పారు. ఇక‌ముందు ఇలాంటిది చేయొద్ద‌ని కోరాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -