Friday, May 3, 2024
- Advertisement -

క‌మెడియ‌న్ అవ‌కాశాలొస్తున్నా.. హీరోగా వ‌ద‌ల‌ని క‌మెడియ‌న్‌

- Advertisement -

హాస్య‌నటుడిగా కొన‌సాగుతున్న సునీల్ ఆ త‌ర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి వ‌రుస సినిమాలు చేశాడు. హీరోగా సినిమాలు చేస్తుండ‌డంతో హాస్య‌న‌టుడిగా చేయ‌డం ఆపేశాడు. అయితే హీరోగా త‌న‌కు క‌లిసి రావ‌డంతో మ‌ళ్లీ హాస్య‌న‌టుడిగా కొన‌సాగ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు. రవితేజ, శ్రీనువైట్ల ప్ర‌స్తుతం క‌మెడియ‌న్‌గా సునీల్ ఒప్పుకున్నాడు. క‌మెడియ‌న్‌గా దాదాపు ఇప్పుడు మూడు సినిమాల‌కు అంగీక‌రించాడు.

అయితే హీరోగా మాత్రం సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తి ప్ర‌ద‌ర్శిస్తున్నాడు. హీరోగా తాను సినిమాలు చేస్తూనే ఉంటాన‌ని చెబుతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు హీరోగా న‌టించ‌డానికి సునీల్ ఒక సినిమా అంగీక‌రించాడ‌ని స‌మాచారం. మంచి ఫాంలో ఉండగానే హీరోగా టర్న్‌ తీసుకున్న సునీల్‌ ఒకటి రెండు సినిమా విజయాలు తప్ప హీరోగా ఆకట్టుకోలేకపోయాడు. హీరోగా మాత్రం తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాడు.

సునీల్‌కు హీరోగా కెరీర్‌లో పూలరంగడు హిట్ సినిమా. ఈ సినిమాను తీసిన‌ ద‌ర్శ‌కుడు వీరభద్రంతో మ‌రో సినిమా చేయ‌డానికి సునీల్ సిద్ధ‌మ‌య్యాడంట‌. అంజి రెడ్డి ప్రొడక్షన్ బ్యానర్‌లో రూపొందించే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ ప‌నులు కొన‌సాగుతున్నాయ‌ని స‌మాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -