Thursday, May 23, 2024
- Advertisement -

20 బంతుల్లోనే 102 రన్స్‌తో సాహూ వరల్డ్ రికార్డ్…..

- Advertisement -

రెండు వారాల క్రితం నిదహాస్ ట్రోఫీ ఫైనల్లో బంగ్లాదేశ్‌పై దినేశ్ కార్తీక్ అద్భుత బ్యాటింగ్ చేయ‌డంతో ముక్కోణ‌పు ట్రోఫీనీ ఇండియా గెలుచుకుంది. 8 బంతుల్లో 29 పరుగులు చేసిన కార్తీక్ చివరికి బంతికి సిక్స్ బాది భారత్‌కు ఒంటి చేత్తో కప్ అందించాడు.

అదే బాటలో ఇప్పుడు మరో భారత వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా కూడా చెలరేగిపోయాడు. ఐపీఎల్ సమీపిస్తోన్న తరుణంలో కేవలం 20 బంతుల్లోనే 102 పరుగులు చేశాడు. సాహా.. 14 సిక్సులు, 4 ఫోర్లు బాది పరుగుల వరద పారించాడు. ప్రపంచ క్రికెట్లో ఏ ఫార్మాట్‌లోనైనా ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ కావడం విశేషం.

కోల్‌కతాలో జరిగిన టీ20 క్లబ్ మ్యాచ్‌లో సాహా ఈ ఫీట్ సాధించాడు. జేసీ ముఖర్జీ ట్రోఫీలో భాగంగా మోహన్‌ బగన్‌-బెంగాల్‌ నాగ్‌పూర్‌ రైల్వేస్‌ జట్ల మధ్య మ్యాచ్ జరగగా.. మోహన్‌ బగన్‌ జట్టుకు సాహ ప్రాతినిధ్యం వహిస్తోన్న సాహా ఇలా అదరగొట్టేసి అందరి దృష్టినీ తన వైపునకు తిప్పుకున్నాడు.

బెంగాల్‌ నాగ్‌పూర్‌ రైల్వేస్‌ జట్టు తొలుత బ్యాటింగ్‌ చేసి 20 ఓవర్లలో 151 పరుగులు చేయగా, ఛేజింగ్‌లో ఓపెనర్‌గా క్రీజులోకి వచ్చిన సాహా ఇలా బ్యాటు ఝళిపించడంతో ఒక్క వికెట్‌ కూడా నష్టపోకుండా ఏడు ఓవర్లలోనే మోహన్‌ బగన్ జట్టు గెలుపొందింది. ప్రత్యర్థి జట్టు బౌలర్ అమన్‌ ప్రసాద్‌ వేసిన ఏడవ ఓవర్‌లో సాహా 37 పరుగులు చేయడం మరో విశేషం. సాహా చెలరేగడానికి తోడు అదే జట్టులో ఓపెనర్‌గా వచ్చిన బ్యాట్స్‌మెన్ అమన్‌ కూడా 22 బంతుల్లో 43 పరుగులు చేయడంతో సాహా టీమ్ ఘన విజయం సాధించింది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -