Saturday, May 18, 2024
- Advertisement -

ఆప‌రేష‌న్ చేయించుకున్న స్టార్ క‌మెడియ‌న్‌

- Advertisement -

హాస్య న‌టుడిగా బిజీగా ఉన్న సునీల్ హీరోగా ఎంట్రీ ఇచ్చి కొన్ని సినిమాలు చేశాడు. హీరోగా నిల‌దొక్కునే స్థాయిలో సినిమాలు ఆడ‌లేదు. వ‌రుస సినిమాల ఫ్లాపుల‌తో సునీల్ ఆందోళ‌న‌లో ఉన్నాడు. చివ‌రికి యూట‌ర్న్ తీసుకొని క‌మెడియ‌న్‌గా చేయ‌డానికి ముందుకు వ‌చ్చాడు. ఇప్ప‌టికే ప‌లు సినిమాల్లో క‌మెడియ‌న్‌గా సునీల్ ఒప్పేసుకున్నాడు.

అయితే సినిమాల కోసం సునీల్ ఆప‌రేష‌న్ చేయించుకున్నాడు అని సమాచారం. మొహం మీద అక్కడక్కడ చిన్న ఉలిపిరికాయలు ఉండ‌డంతో శస్త్ర చికిత్స ద్వారా వాటిని తొలగించుకున్నట్లు తెలుస్తోంది. శ‌స్త్ర‌చికిత్స త‌ర్వాత కొన్నాళ్లు విశ్రాంతి తీసుకొని సినిమా షూటింగ్‌లో సునీల్ పాల్గొన‌నున్నాడు.

ఇప్పటికే ఎన్టీఆర్-త్రివిక్రమ్, రవితేజ-శ్రీనువైట్ల, అల్లరి నరేశ్‌-భీమినేని సినిమాల్లో న‌టించ‌డానికి సునీల్ ఎంపిక‌య్యాడు. ఇప్పుడు ఇంకో సినిమాకు కూడా సునీల్ ఓకే చెప్పిన‌ట్లు స‌మాచారం. సీనియ‌ర్ న‌టుడు రాజశేఖర్ హీరోగా రూపొందించే సినిమాలో సునీల్‌కు మాంచి ఫుల్ లెంగ్త్ పాత్ర చేయ‌డానికి ఆఫ‌ర్ వ‌చ్చింది. ఈ విధంగా సినిమాల‌తో బిజీ అయ్యాడు. మ‌ళ్లీ త‌న‌దైన హాస్యంతో సునీల్ ప్రేక్ష‌కుల‌ను అల‌రించాల‌ని ఆశిద్దాం.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -