Thursday, May 2, 2024
- Advertisement -

‘గ్యాంగ్‌’ సినిమా ద‌ర్శ‌కుడికి హీరో కారు గిఫ్ట్‌

- Advertisement -

త‌న సినిమాల‌తో తమిళమే కాకుండా తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైన హీరో సూర్య. ఆయన ఇటీవ‌ల న‌టించిన ‘గ్యాంగ్‌’ సినిమా (తమిళంలో ‘తానా సెర్న్‌దా కూటమ్‌)తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి సూప‌ర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా త‌మిళ్‌లో బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డు సృష్టించ‌డంతో సూర్య కెరీర్‌లో మ‌రో హిట్ సినిమా ప‌డింది. దీంతో ఆ సినిమా ద‌ర్శ‌కుడికి మ‌ర‌చిపోలేని బ‌హుమ‌తిని సూర్య ఇచ్చాడు. గ్యాంగ్ సినిమా ద‌ర్శ‌కుడు విఘ్నేశ్‌ శివన్‌ను అభినందిస్తూ సూర్య కారును బహుమతి ఇచ్చాడు.

ఈ విషయాన్ని విఘ్నేశ్ సోష‌ల్ మీడియ‌లో పంచుకున్నాడు. సూర్య చూపిన ప్రేమకు ధన్యవాదాలు అని, ఇది వెల కట్టలేనిదని.. తనలాంటి కొత్త దర్శకుల్ని ప్రోత్సహించడానికి చాలా పెద్ద హృదయం కావాలని చెప్పాడు సూర్య చూపిన ప్రేమకు తను అర్హుడినేనా అని ప్రశ్నించుకున్నాన‌ని తెలిపారు. ఈ సందర్భంగా కారుతో దిగిన ఫొటోలను విఘ్నేశ్‌ పంచుకున్నారు.

సూర్య ఇప్పుడే కాదు గతంలోనూ ద‌ర్శ‌కుల‌కు బ‌హుమ‌తులు ఇచ్చారు. ‘సింగం 3’ దర్శకుడు హరికి, ‘పసంగ 2’ (తెలుగులో ‘మేము’) దర్శకుడు పాండిరాజ్‌కు సూర్య కార్లు బహుమతిగా ఇచ్చారు. ఈ విధంగా ద‌ర్శ‌కుల‌ను అభినందిస్తూ సూర్య త‌న ప్ర‌త్యేక‌త చాటుకుంటున్నాడు.

ప్ర‌స్తుతం సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో సూర్య, సాయిప‌ల్ల‌వి, ర‌కుల్‌ప్రీత్‌సింగ్ జోడిగా ‘ఎన్‌.జి.కె’ సినిమా చేస్తున్నాడు. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్ బ్యాన‌ర్‌పై ఈ సినిమా రూపొందిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -