త‌మ‌న్నా కూడా చాలాసార్లు…

కోటి పారీతోష‌కం తీసుకునే హీరోయిన్ల‌లో స్టార్ హీరోయిన్ త‌మ‌న్నా ఒక‌రు.త‌మ‌న్నా చాలాసార్లు ఏడ్చిసేద‌ట‌. కోటి రూపాయలన్నా తీసుకునే తమన్నా ఏడ్వడం ఏమిటి? అనుకుంటున్నారా?ఇది నిజమే! ఈ విషయాన్ని ఇటీవలే తమన్నా స్వయంగా చెప్పుకొచ్చింది. అస‌లు విష‌యం ఏమిటంటే…తమన్నాకు చిన్నతనంలో తన పేరంటే అస్సలు ఇష్టం ఉండేది కాదట! తన పేరు మార్చమని తండ్రితో తరచూ దెబ్బలాడేదట.తన తల్లి తనను ఇతరులకు పరిచయం చేసే సమయంలో తన పేరుని తమన్న అని చెబితే అస్సలు ఒప్పుకునేది కాదట!

అందరి ముందూ తన పేరు అంజలీ అనో, ప్రియాంకో అనో చెప్పేదట! పెద్దవుతున్న కొద్దీ తన పేరంటే ఇష్టం ఏర్పడిందట! ఇప్పుడు తనను ఆ పేరుతోనే పిలిస్తేనే పలుకుతుందట! పెద్దవుతున్న కొద్దీ తనపేరంటే ఇష్టం ఏర్పడింది అని చెప్పింది కానీ, ఆ ఇష్టం ఎలా వచ్చిందో మాత్రం చెప్పకుండా దాటవేసింది!