Monday, May 6, 2024
- Advertisement -

సైకిలెక్కేందుకు గురానాథ్‌రెడ్డి రెడీ..

- Advertisement -

ప్ర‌స్తుతం జ‌గ‌న్ పాద‌యాత్ర క‌ర్నూలు జిల్లాలో కొన‌సాగుతోంది. 21వ రోజున జగన్ పాదయాత్ర కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో సాగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉత్సాహంగా యాత్రలో భాగస్వామ్యులవుతుండగా.. సామాన్య ప్రజానీకం జగన్ కు తమ కష్టనష్టాలను చెప్పుకొంటున్నారు.

కర్నూలు జిల్లాలో జగన్ పాదయాత్ర ముగింపు దశకు వచ్చింది. కడప జిల్లాతో మొదలైన జగన్ యాత్ర కర్నూలు మీదుగా.. అనంతపురం జిల్లాలోకి ప్రవేశించే సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో జగన్ కు ఝలక్ ఇవ్వడానికి సిద్ధం అవుతోందట తెలుగుదేశం పార్టీ.

జగన్ పాదయాత్ర అనంతపురం జిల్లాలోకి ప్రవేశించగానే.. అనంతపురం మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డికి టీడీపీ తమ పార్టీ కండువా వేయనుందని సమాచారం. దీనికి అంతా సిద్ద‌మైంది. వచ్చే ఎన్నికల్లో గురునాథరెడ్డికి అవకాశం ఇవ్వదలుచుకోలేదు జగన్. అందుకే గ‌త‌కొన్నాల్లుగా పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

అనంతపురం నుంచి మైనారిటీ అభ్యర్థి పోటీలో ఉంటాడని ఇది వరకే వైసీపీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో గురునాథరెడ్డి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిపోతున్నారనే వార్తలు వస్తున్నాయి. కచ్చితంగా జగన్ అనంతపురం జిల్లాలో పాదయాత్ర మొదలుపెట్టగానే గురునాథరెడ్డికి పచ్చకండువా వేయడం ద్వారా జగన్ కు ఝలక్ ఇవ్వాలనేది టీడీపీ వ్యూహంగా తెలుస్తోంది.

మరోవైపు అనంతపురం సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గురునాథ రెడ్డి టీడీపీలోకి చేరడాన్ని వ్యతిరేకిస్తున్నాడు. ఈ మేరకు ఆయన బాబును కలిసి నిరసన తెలిపారు. ప్ర‌భాక‌ర్ చౌద‌రికి చెక్ పెట్టేందుకు జేసీ బ్ర‌ద‌ర్స్ గురునాథ్‌రెడ్డిని పార్టీలోకి తీసుకొస్తున్నార‌నె వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. అయితే గురునాథరెడ్డి వచ్చి చేరినా.. వచ్చే ఎన్నికల్లో టికెట్ మాత్రం చౌదరికే అని స్పష్టం చేశారట చంద్రబాబు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -