- Advertisement -

మా మంచి విజయ్!

- Advertisement -

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. ఖుషి విజయోత్సవం సందర్భంగా వంద కుటుంబాలకు ఒక్కో ఫ్యామిలీకి రూ. లక్ష చొప్పున కోటి రూపాయలు పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. ఎవరైనా ఆపదలో ఉన్నారనే విషయం తన దృష్టికి వస్తే చాలు స్పందించే విజయ్ తాజాగా ఓ కుటుంబానికి అండగా నిలబడ్డారు.

శ్రీకాకుళం కి చెందిన కోటబొమ్మాళి ప్రాంతంలో ఓ చిన్నారి రోడ్డు ప్రమాదంలో తన కాలుని పోగొట్టుకుంది.ఈ విషయాన్ని విజయ్ దృష్టికి తీసుకెళ్లగా వివరాలు కనుక్కొని లక్ష రూపాయల ఆర్ధిక సాయాన్ని ఆ చిన్నారి కుటుంబానికి అందించాడు. ఎంపీ రామ్మోహన్ స్వయంగా ఆ చెక్కును చిన్నారికి అందించారు. ఈ వార్త విన్న విజయ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తుండగా సోషల్ మీడియాలో రియల్ హీరో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఖుషి హిట్ తర్వాత విజయ్ పలు సినిమాలు చేస్తుండగా ఇందులో ఒకటి ఫ్యామిలీ స్టార్. పూర్తి డిఫరెంట్ రోల్‌లో ఈ సినిమాలో కనిపించనున్నారు విజయ్. ఇక రీసెంట్‌గా కీడా కోలా ప్రీ రిలీజ్‌లో మరోసారి తరుణ్ భాస్కర్‌తో సినిమా చేస్తానని ప్రకటించారు కూడా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -