Monday, May 20, 2024
- Advertisement -

చంద్రబాబు…విడుదల

- Advertisement -

52 రోజుల రిమాండ్ తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విడుదలయ్యారు టీడీపీ చీఫ్,మాజీ సీఎం చంద్రబాబు. ఇక బాబుకు స్వాగతం పలికేందుకు కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బాబు విడుదల సందర్భంగా రాజమండ్రి జైలు చుట్టూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

కండీషన్స్‌తో కూడిన బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో చంద్రబాబు ర్యాలీలు తీయొద్దని.. మీడియాతో మాట్లాడొద్దని హైకోర్టు ఆదేశించింది. ఇక బాబు బయటకు వచ్చిన తర్వాత ఆయన్ని ఆలింగనం చేసుకున్నారు టీడీపీ నేతలు. నేరుగా ఇంటికి వెళ్లనున్న చంద్రబాబు రేపు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే అవకాశం ఉంది.

నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ లభించింది. ప్రధానంగా చంద్రబాబు ఆరోగ్య పరిస్థితినే చూపిస్తూ బెయిల్‌పై వాదించారు. ఆరోగ్యం బాగోలేనందున బెయిల్‌ ఇవ్వాలని…3నెలల క్రితమే ఎడమ కంటికి ఆపరేషన్‌ జరిగిందని తెలిపారు. కుడి కంటికి ఆపరేషన్‌ చేయాల్సి ఉందని …ఒళ్లు నొప్పులు, దద్దుర్లతో చంద్రబాబు ఇబ్బందులు పడుతున్నారని పిటిషన్‌‌లో పేర్కొన్నారు. దీంతో ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. స్కిల్ స్కామ్‌లో సెప్టెంబర్‌ 9న నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -