Sunday, May 5, 2024
- Advertisement -

హీరో విశాల్ అరెస్ట్

- Advertisement -

త‌మిళ స్టార్ హీరో విశాల్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు.గ‌త రెండు రోజులుగా త‌మిళ నిర్మాత మండ‌లికి ,విశాల్‌కు మ‌ధ్య పెద్ద వివాదం జ‌రుగుతుంది.న‌డిగ‌ర సంఘం అధ్య‌క్షుడిగా ఉన్నారు విశాల్‌.అయితే ఈ నెల 21(శుక్ర‌వారం) 9 చిన్న సినిమాల విడుద‌ల‌కు విశాల్ గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో ఈ స‌మ‌స్య మొద‌లైంది.ఇలా ఒకేసారి 9 సినిమాలు విడుద‌లైతే చిన్న నిర్మాత‌ల ప‌రిస్థితి ఏంట‌ని వారు ప్రశ్నిస్తున్నారు.చిన్న సినిమా నిర్మాతల పరిస్థితి గురించి ఆలోచించకుండా విశాల్ ప్రవర్తిస్తున్నారని ఇంకా పలు సమస్యలు ఉన్నప్పటికీ వాటిని సాల్వ్ చేయలేదని విశాల్ పై విమర్శలు చేశారు.

విశాల్‌కు వ్యతిరేఖంగా నినాదాలు చేస్తూ పలువురు నిర్మాతలు నిర్మాతల సంఘా భవనానికి తాళాలు వేశారు. .వీరికి విశాల్ వ్యతిరేక వ‌ర్గం కూడా జ‌త కావ‌డంతో వివాదం మ‌రింత ముదిరింది.అయితే ఈ రోజు(బుధ‌వారం) ఉద‌యం నిర్మాతల సంఘా భవనానికి చేరుకున్న విశాల్ తాళాలను ప‌గ‌ల‌గొట్టే ప్ర‌య‌త్నం చేశాడు.దీంతో నిర్మాత‌లు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు పోలీసులు విశాల్‌ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -