చలి అనేది మనుషులకే కాదు ,దేవుడికి కూడా ఉంటుందట. అవును మీరు వింటుంది నిజమే. మనుషులతో పాటు దేవుళ్లకు కూడా చలి వేస్తుందని ,కొందరు భక్తులు… దేవుడికి స్వెట్టర్ వేసి, మంకీ క్యాప్ తగిలించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..పుణెలో ఉన్న సారస్బాగ్ గణపతికి ప్రతి సంవత్సరం చలికాలంలో ఇలా స్వెట్టర్ వేసి, మంకీ క్యాప్‌తో అలంకరిస్తున్నారు. గత 30 సంవత్సరాలుగా ఆలయ నిర్వాహకుడు శశికాంత్ ఇలా శీతాకాలంలో విగ్రహానికి ఉలెన్ క్యాప్, స్వెట్టర్ వేస్తున్నాడు.
గతంలో వారి పూర్వీకులు కూడా ఇలాంటి పద్దతినే పాటించేవారని,దానిని నేను, నా కుటుంబ సభ్యులు కొనసాగిస్తున్నామని తెలిపారు. దేవుడికి రోజుకో రంగు స్వెట్టర్‌ను మారుస్తుంటామని శశికాంత్ చెబుతున్నారు. ఈ అనవాయితీ ఇప్పటిది కాదని గత 250 సంవత్సరాలు నుంచి ఇది కొనసాగుతుందని అంటున్నారు స్థానికులు. చలికాలంలో ఈ దేవుడిని దర్శించుకునే వారి సంఖ్య కూడా ఎక్కువుగా ఉంటోందని సమాచారం.
- పూరీ జగన్నాథ్ ‘స్లమ్‌డాగ్’ టీజర్ అవుట్
- ‘టాక్సిక్’ క్రేజీ స్పెషల్ వీడియో రిలీజ్..
- వివాహేతర సంబంధం.. ఆర్మీ జవాన్‌ను కొట్టి చంపిన భార్య!
- బొల్లా బ్రహ్మనాయుడు కుటుంబానికి జగన్ అండ
- జాన్వీ కపూర్ పై ట్రోలింగ్.. జగపతి బాబు కీలక వ్యాఖ్యలు !
