Thursday, May 2, 2024
- Advertisement -

జగన్ బస దగ్గర అచ్చెన్న రౌడీయిజం…… దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన జగన్

- Advertisement -

తెలుగుదేశం పార్టీలో ఉన్న అచ్చెన్నాయుడు, చింతమనేని, జేసీలాంటి నాయకుల రౌడీయిజం గురించి కొత్తగా చెప్పేదేముంది. అయితే బెదిరిపోవడానికి అక్కడున్నది ఆషామాషీ నాయకుడు కాదు కదా……వైఎస్ జగన్. సోనియానే ఎదిరించి, వైఎస్ మరణం వెనకాల ఉన్నారు అన్న అందరితోనూ ఈ రోజుకీ తెరవెనుక పోరాటం చేస్తున్న నాయకుడు. అందుకే నంబర్ ఒన్ కోటీశ్వరులు కూడా బాబుతో కుమ్మక్కై జగన్‌ని దెబ్బకొట్టాలని చూస్తూనే ఉన్నారు. సీక్రెట్ మీటింగ్స్‌తో సన్నాహాలు చేస్తున్నారు.

అగ్రనాయకుల వ్యవహారం అలా ఉంటే లోకల్ నాయకుడైన అచ్చెన్న మరోవిధంగా జగన్‌ని భయపెట్టాలని చూశాడు. జగన్ బస చేసిన ప్రాంతంలో…..ఆ ప్రాంతానికి దగ్గరలో తన మనుషులతో హడావిడి చేయించాడు. అచ్చెన్న సొంత నియోజకవర్గంలో జగన్ పాదయాత్రకు ప్రజలు రాకుండా ఉండేలా ప్రజలను కూడా బెదిరించాడు. ప్రభుత్వ పథకాలు అన్నీ ఆపేస్తానన్నాడు. జగన్ పాదయాత్రకు వెళితే చూస్తూ ఊరుకోం……అనుభవిస్తారు అని అచ్చెన్న మనుషులు అన్ని ఊర్లలోనూ బహిరంగంగానే బెదిరింపులకు దిగారు. అధికార యంత్రాంగం కూడా అచ్చెన్న రౌడీయిజాన్ని చూసీ చూడనట్టుగా వదిలేసింది. అయితే జనం మాత్రం వైఎస్ జగన్ పాదయాత్రకు పోటెత్తారు. పాదయాత్రను పులివెందుల నుంచి గుంటూరు, కృష్ణా ప్రజలు, గోదావరి జిల్లాల ప్రజలు ఆదరించినట్టుగానే సిక్కోలు ప్రజలు కూడా వెన్నంటి నిలిచారు. పైగా 2019 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిల్లోనూ అచ్చెన్నాయుడు గెలవకూడదని, ఈ రౌడీ రాజకీయాలను తట్టుకోలేకపోతున్నామని విన్నవించుకున్నారు.

ఈ మొత్తం ఎపిసోడ్‌పై ఇంటెలిజెన్స్ సమాచారం అచ్చెన్నాయుడితో పాటు టిడిపి పెద్దలను కూడా కంగారు పెట్టింది. తిత్లీ తుఫానును ఎదుర్కున్న హీరోలం మేం, కనీసం ఇటువైపు రాని విలన్ జగన్ అని పచ్చ మీడియాతో చాలా పెద్ద ఎత్తున విషప్రచారం చేసినప్పటికీ ప్రజలు మాత్రం జగన్‌కే పట్టం కట్టడం అధికార పార్టీని కలవరపెడుతోంది. పాదయాత్ర అట్టర్ ఫ్లాప్ అవ్వడం ఖాయమనుకున్న సిక్కోలులో కూడా, మందీ మార్బలం బలంగా ఉన్న అచ్చెన్నాయుడు నియోజకవర్గంలో పాదయాత్ర సూపర్ సక్సెస్ అవ్వడంతో శ్రీకాకుళం జిల్లా టిడిపి నాయకులను కూడా ఆశ్ఛర్యపరుస్తోంది. అచ్చెన్నాయుడు రౌడీ రాజకీయాలను ప్రజాదరణతో, ప్రజల అభిమానంతోనే ఎదుర్కున్న జగన్‌ లీడర్‌షిప్ క్వాలిటీస్‌ని మాత్రం విశ్లేషకులు కూడా అభినందిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -