Monday, May 20, 2024
- Advertisement -

నా క‌ల‌లు నెర‌వేర్చే అమ్మాయి దొర‌క‌లేదు: విశాల్‌

- Advertisement -

తమిళ టాప్ హీరో విశాల్ ఇటీవల ‘పందెంకోడి2’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తెలుగులో ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ తమిళంలో మాత్రం మంచి టాక్ రావడంతో ఇప్పుడు ‘పందెంకోడి3’ తీయడానికి రెడీ అవుతున్నారు. అయితే ఇటీవల మీడియా ముందుకు వచ్చిన విశాల్ కొన్ని విషయాలను పంచుకున్నారు. చాలా కాలంగా కోలీవుడ్ లో విశాల్.. వరలక్ష్మిల ప్రేమ వార్తలు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారనే వార్తలు హల్చల్ చేశాయి.

కానీ వీరు మాత్రం తాము కేవలం స్నేహితులు మాత్రమేనని చెబుతూ వస్తున్నారు. తాజాగా మీడియా విశాల్‌ను మీ పెళ్లి ఎప్పుడు ఉంటుందని ప్రశ్నించగా.. ఆయన ఇచ్చిన సమాధానం ఆసక్తికరంగా మారింది. ”నా కలలు నెరవేరిన తరువాతే నేను పెళ్లి చేసుకుంటాను.. కాబట్టి దానికి ఇంక చాలా సమయం ఉందని చెప్పి త‌ప్పించుకున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -