Friday, April 26, 2024
- Advertisement -

లాభాల్లో వాటాలు అడుగుతున్న నాని?

- Advertisement -

న్యాచుర‌ల్ స్టార్ నాని సినిమాకు నాలుగు కోట్లు తీసుకుంటాడ‌ని తెలుస్తుంది. అత‌ని మార్కెట్‌తో పోలిస్తే నాని తీసుకునేది న్యాయమే అనిపిస్తుంది. నాని ఇటీవ‌లే న‌టించిన దేవ‌దాస్ సినిమా మంచి విజ‌యాన్ని సొంతం చేసుకుంది. అయితే నాని తన కొత్త సినిమా కోసం రెమ్యూనరేషన్ తీసుకోకుండానే సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడట. ప్రస్తుతం నాని హీరోగా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ‘జెర్సీ’ అనే సినిమాను రూపొందిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించింది చిత్రబృందం. శ్రద్ధాశ్రీనాథ్ హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాలో నాని క్రికెటర్ గా కనిపించనున్నాడు.

ఈ సినిమాకి నాని రెమ్యూనరేషన్ కాకుండా.. లాభాల్లో వాటా తీసుకునే పద్దతికి రెడీ అవుతున్నాడు. ఈ మధ్యకాలంలో హీరోలు ఇదే పద్దతిని అనుసరిస్తున్నారు. నానికి కథ బాగా నచ్చడంతో సినిమాని మరింత ఖర్చుతో తీయమని, తనకి రెమ్యూనరేషన్ కాకుండా లాభాల్లో వాటా ఇవ్వమని నిర్మాతకి చెప్పేశాడట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -