Saturday, May 4, 2024
- Advertisement -

అదాశ‌ర్మ ఏంటీ ఇలా త‌యారైంది?

- Advertisement -

హీరోయిన్ అదాశ‌ర్మ హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు కుర్ర‌కారుపై ఎటాక్ చేసింది.ఈ సినిమాతో యూత్‌కు బాగా ద‌గ్గ‌రైంది ఆదా.ఆ తరువాత ‘సన్నాఫ్ సత్యమూర్తి’,’క్షణం’ వంటి సినిమాల్లో నటించింది. నటిగా మంచి పేరు దక్కించుకున్నప్పటికీ అదాకి సరైన హిట్లు మాత్రం రాలేదు.దీంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.గతేడాది బాలీవుడ్ లో ‘కమాండో 2’ సినిమాలో నటించినా.. అదాకు వర్కవుట్ కాలేదు. ఈ మధ్య కాలంలో ఫోటో షూట్లు, వీడియోలు అంటూ కాలం గడుపుతోన్న ఈ బ్యూటీ సడెన్ గా రోడ్ మీద కూరగాయలు అమ్ముకుంటూ కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది.

అసలు ఆమెను గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది.అదా అవతారం చూసిన వారు షాక్ అవుతున్నారు. ఓ హాలీవుడ్ సినిమా కోసం అదా ఈ లుక్ ని టెస్ట్ చేస్తోందని తెలిసింది. ప్రస్తుతం అదా కూరగాయలు అమ్ముతున్న ఫోటోలు ఆన్ లైన్ లో వైరల్ అవుతున్నాయి. కికి చాలెంజ్‌తో ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేసింది అదా శ‌ర్మ‌.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -