- Advertisement -
అల్లరి నరేష్,సునీల్ ఇద్దరికి గత కొంతకాలంగా సరైన హిట్లు లేవు.దీంతో సునీల్ మళ్లీ కమెడియన్‌గా రీ ఎంట్రీ ఇస్తున్నాడు.ఇక అల్లరి నరేష్ తనకు సుడిగాడు వంటి హిట్ ఇచ్చిన భీమినేని శ్రీనివాస్ దర‍్శకత్వంలో సిల్లీ ఫెలోస్ అనే కామెడీ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో సునీల్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు.ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్.
అల్లరి నరేష్ మార్క్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. బైక్ పైన వెళుతున్న నరేష్, సునీల్ మధ్య జరిగే సంభాషణతో ఈ టీజర్‌ను డిజైన్ చేశారు. ఈ సినిమాలో పూర్ణ, చిత్ర శుక్లాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.
