Sunday, May 19, 2024
- Advertisement -

అంజ‌లి ఏంటీ ఇలా మారిపోయింది…!

- Advertisement -

ఫోటో సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచిమైంది హీరోయిన్ అంజ‌లి.త‌రువాత తెలుగులో పెద్ద‌గా అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో త‌మిళ ఇండ‌స్ట్రీపై ఫోక‌స్ పెట్టి అక్క‌డ స్టార్ హీరోయిన్‌గా మారింది. అంజలి బొద్దుగా ఉండ‌టం వ‌ల్ల త‌మిళనాడులో బాగానే అవ‌కాశాలు ద‌క్కాయి.త‌రువాత తెలుగులో కొన్ని సినిమాల‌లో అవ‌కాశాలు రావడంతో టాలీవుడ్‌లో కూడా ప‌లు సినిమాల‌లో న‌టించి మెప్పించింది.కెరీర్ పీక్ టైమ్‌లోనే కుటుంబ త‌గ‌దాలు,ప్రేమ వ్య‌వ‌హారంతో రోడ్డున ప‌డి సినిమాల‌లో అవ‌కాశాలు మిస్ చేసుకుంది.బొద్దుగా ఉంటూనే యూత్ హృదయాలను కొల్లగొట్టేసిన అంజలి, ఇప్పుడు బాగా సన్నబడిపోయింది.

తన ఫేస్ బుక్ లోను .. ట్విట్టర్ లోను ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు చూసినవాళ్లు ఆశ్చర్యపోతున్నారు .. అంతగా అంజలి సన్నబడిపోయింది. నిజం చెప్పాలంటే ఒక్కసారిగా ఈ ఫోటో చూసిన వాళ్లు అంజలి అంటే నమ్మరు. మరి ఏదైనా సినిమాలో పాత్ర కోసం ఆమె సన్నబడిందా? బొద్దుగా ఉండటం వల్లనే అవకాశాలు రావడం లేదనే ఉద్దేశంతో బరువు తగ్గిందా? అనేది తెలియడం లేదు. ఈ ఫోటోలు చూసిన వాళ్లు మాత్రం అంజలి మరీ సన్నబడిపోయిందనీ, ఆమె బొద్దుగా ఉంటేనే బాగుందనే కామెంట్స్ చేస్తున్నారు. మ‌రి సినిమా కోసం ఇలా స‌న్న‌బ‌డిందో లేక మ‌రో కార‌ణ‌మో తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -