Saturday, May 4, 2024
- Advertisement -

ఫేస్‌బుక్ ఉద్యోగిని దెబ్బ‌కు దిగి వ‌చ్చిన యునైటెడ్ ఎయిర్ లైన్స్‌  …

- Advertisement -

తమ ఎనిమిది నెలల బిడ్డతో కలిసి, బిజినెస్ క్లాస్ లో సిడ్నీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో బయలుదేరిన ఓ జంటకు విమానంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. విమామనంలోని ఆన్ బోర్డ్ ఇంటర్నెట్ సాయంతో, తాను పడుతున్న ఇబ్బందిని చెబుతూ, సిబ్బంది వైఖరిని ప్రశ్నిస్తూ, ఆ తల్లి ఓ పోస్టు పెట్టగా, దానిపై విపరీతమైన స్పందన వచ్చింది. దీంతో విమానం శాన్ ఫ్రాన్సిస్కో చేరే సమయానికి ఎయిర్ లైన్స్ సిబ్బంది క్షమాపణల పత్రం, పూర్తి టికెట్ రిఫండ్ తో సిద్ధంగా నిలిచారు.

వివరాల్లోకి వెల్తే…తన 8 నెలల బాబు, భర్తతో కలిసి సిడ్నీ నుంచి శాన్‌ ఫ్రాన్సిస్కోకు యునైటెడ్‌ ఎయిరెలైన్స్‌ ఫ్లైట్‌లో బయలు దేరిన ఫెస్‌బుక్‌ ఉద్యోగి కృపా బాలకు వింత అనుభవం ఎదురైంది. విమానంలో తన కొడుకు గుక్కపట్టి ఏడ్వడంతో బిజినేస్‌ క్లాస్‌ సీట్‌లో కూర్చున్న ఓ కుటుంబం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో విమాన సహాయకుడు ఆమె దగ్గరకు వచ్చి చిన్నపిల్లను 5 నిమిషాల కంటే ఎక్కవ ఏడిస్తే అనుమతించమని తెలిపారు.

కృపా పటేల్ ఎంతగా సముదాయించినా, చాలా సేపటి వరకూ బిడ్డ ఏడుపు ఆపలేదు. దీంతో సిబ్బంది ఆమెపై నానాయాగీ చేశారు. తనకు ఎదురైన అనుభవాన్ని ఆమె, విమానంలో నుంచే, ఫేస్ బుక్ లో పోస్టు చేసింది. ఆమె పోస్టు వేలకొద్దీ షేర్లను తెచ్చుకోవడంతో, యునైటెడ్ ఎయిర్ లైన్స్ యాజమాన్యం స్పందించింది. విమానం నుంచి ఆమె దిగేసరికి ఎయిర్ లైన్స్ ఉన్నతాధికారులు, ఆ దంపతులకు క్షమాపణలు చెబుతూ, ప్రయాణం నిమిత్తం వారు చెల్లించిన పూర్తి డబ్బును వెనక్కు ఇస్తామని ఆఫర్ చేశారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -