Monday, May 13, 2024
- Advertisement -

డైరెక్టర్‌ను కొట్టిన హీరోయిన్ అంజ‌లి

- Advertisement -

తెలుగు హీరోయిన్ అంజ‌లి సినిమా షూటింగ్‌లో ద‌ర్శ‌కుడిని కొట్టిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.పూర్తి వివరాల్లోకి వెళ్తే…అంజ‌లి ప్ర‌స్తుతం లీసా అనే మూవీలో న‌టిస్తుంది.సినిమాలోని యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చిత్ర‌క‌రిస్తున్నారు.షూటింగ్ భాగంగా అంజలి తన చేతిలో ఉండే దోస పెనంను కెమెరా ముందుకు విసిరేయాలి. డైరెక్టర్ చెప్పినట్లుగా అంజలి కూడా చేసింది. కానీ అది పొరపాటున వెళ్లి డైరెక్టర్ ముఖానికి తాకింది.

దీంతో ఆయన కనుబొమ్మల మధ్య చిట్లి పెద్ద గాయమైంది.వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లి గాయానికి కుట్లు వేయించినట్లు తెలుస్తోంది. త‌న వ‌ల్ల ద‌ర్శ‌కుడికి దెబ్బ త‌గ‌ల‌డంపై అంజ‌లి తెగ బాధ‌ప‌డుతుంద‌టా.ఇక అంజ‌లి తెలుగు అమ్మాయి అయిన‌ప్ప‌టికి త‌మిళంలో బాగా ఫేమ‌స్ అయింది.హీరో జై తో కొన్నాళ్లు ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపింది అంజ‌లి.అత‌నితో బ్రేకప్ చెప్పి ప్ర‌స్తుతం సినిమాల‌పై ఫోక‌స్ చేస్తుంది అంజ‌లి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -