Saturday, May 18, 2024
- Advertisement -

ఆగ‌స్టు 9న మ‌హేశ్ రావ‌డం ప‌క్కానా?

- Advertisement -

టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు ప్ర‌స్తుతం త‌న 25వ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ న‌గ‌ర శివార్ల‌లో జ‌రుగుతుంది.సినిమాలోని కొన్ని కీల‌క స‌న్నివేశాలు అక్క‌డ చిత్రిక‌రిస్తున్నారు.ఇక ఈ సినిమా కోసం మ‌హేశ్ ఫస్ట్ టైం ఫుల్ గెడ్డం మీసంతో క‌నిపించ‌నున్నాడు.అయితే ఈ నెల(ఆగ‌స్టు) 9న మ‌హేశ్ పుట్టిన రోజు ఉండటంతో మ‌హేశ్ అభిమానులు ఆయ‌న పుట్టిన రోజును ఘ‌నంగా నిర్వంహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇదే రోజున సినిమాలోని మ‌హేశ్ ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేస్తార‌ని ఆయ‌న అభిమానులు ఆశ ప‌డుతున్నారు.

ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం ప్రకారం మ‌హేశ్ పుట్టిన రోజున సినిమా టైటిల్‌ను కాని మ‌హేశ్ ఫ‌స్ట్ లుక్ కాని ఉంటుంద‌ని తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో మ‌హేశ్ స‌ర‌స‌న పూజా హెగ్డె న‌టిస్తుంది.ఈ సినిమాకు వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సంగ‌తి అంద‌రికి తెలిసిందే.దిల్ రాజు-అశ్వినీద‌త్‌లు ఇద్ద‌రు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమాను వ‌చ్చే ఏప్రిల్ 5న విడుద‌ల చేయ‌నున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -