Monday, May 13, 2024
- Advertisement -

దర్శకురాలిగా అనుపమ పరమేశ్వరన్ మొదటి సినిమా అదే

- Advertisement -

తెలుగు సినిమా పరిశ్రమ లో అఆ సినిమా తో రంగ ప్రవేశం చేసిన నటి అనుపమ పరమేశ్వరన్. ఆ సినిమా ఈ హీరోయిన్ కి చాల వరకు ఉపయోగపడింది అని చెప్పుకోవచ్చు. అయితే అనుపమ ఆ తర్వాత చాలా సినిమాలు చేసింది, అందులో కొన్ని విజయం సాధించాయి, కొన్ని పరాజయం పొందాయి. ఆసక్తికర అంశం ఏంటి అంటే అనుపమ పరమేశ్వరన్ నటి గా తనదైన ముద్ర వేస్తూ నే దర్శకురాలి గా తనేంటి అనే విషయాన్ని నిరూపించుకోవాలని తాపత్రయం తో ఉందట.

అయితే ఇప్పటికే మలయాళం సినిమా పరిశ్రమ లో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా ఒక సినిమా కి పని చేస్తున్న అనుపమ త్వరలో నే స్వీయ దర్శకత్వం లో ఒక ఆసక్తికర సినిమా తో ప్రేక్షకుల ముందుకు రావాలని అనుకుంటుంది అనుపమ. అయితే ఇప్పటికే కొన్ని కథలు రెడీ చేసి పెట్టుకుంటున్న అనుపమ తన అరంగేట్రం ఒక ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా తో చేయాలనే ఆలోచన తో ఉన్నట్టు తెలుస్తుంది.

ఇప్పటికి అయితే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నటించిన అనుపమ తను డైరెక్ట్ చేసే సినిమా కూడా అన్ని భాషల్లో రావాలనే దిశగా ఆలోచిస్తుందట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -