Saturday, May 18, 2024
- Advertisement -

ఉన్నావ్ అత్యాచార కేసులో సంచలన నిర్ణయం తీసుకున్న సుప్రీంకోర్టు…

- Advertisement -

ఉన్నావ్ అత్యాచార బాధితురాలి కేసు ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. తాజాగా ఈ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు కేలక ఆదేశాలు జారీ చేసింది. ఉన్నావ్ కేసుకు సంబంధించి 5 కేసులను ఢిల్లీ ట్రయల్ కోర్టుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సుప్రీంకోర్టు. రోజువారీ విచారణ జరిపి 45 రోజుల్లో విచారణ పూర్తి చేయాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది.

ఉన్నావో అత్యాచార ఘటన, బాధితురాలి ప్రమాద కేసులో తమకు పూర్తి వివరాలను అందజేయాలని సీబీఐని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. బాధితురాలి కారు ప్రమాద ఘటనపై ఏడు రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాలని సీబీఐకి ఆదేశాలు ఇచ్చింది. బాధిత కుటుంబానికి రూ. 25 లక్షల మధ్యంతర పరిహారం ఇవ్వాలని, ఆమె కుటుంబ సభ్యులతో పాటు బాధితురాలి న్యాయవాదికి రక్షణ కల్పించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -