- Advertisement -
టాలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలి అంటే అనుష్క తరువాతే ఎవరైన. అరుంధతి, భాగమతి వంటి సినిమాలతో తాను ఏంటో నిరుపించుకుంది అనుష్క. బాహుబలి తరువాత అనుష్క క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమా తరువాత భాగమతి సినిమాలో నటించింది. కారణం తెలియదు కాని భాగమతి సినిమా తరువాత ఇప్పటి వరకు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు అనుష్క.
తాజాగా తన కొత్త సినిమా గురించి అనౌన్స్ చేసింది అనుష్క.హేమంత్ మధుకర్ వినిపించిన కథ అనుష్కకి చాలా భిన్నంగా అనిపించడంతో వెంటనే ఈ సినిమాకు ఓకే చెప్పిందట అనుష్క.ఈ సినిమాలో చూపు .. వినికిడి శక్తి లేని పాత్రలో అనుష్క కనిపించనుందనేది తాజా సమాచారం.అనుష్క సరసన మాధవన్ కనిపించనున్నాడు. జనవరిలో సెట్స్‌కు వెళ్లనున్న ఈ సినిమాను కొన వెంకట్ నిర్మిస్తున్నారు.
- ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- కోమటిరెడ్డి..భోళా మనిషి!
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్‌న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’