Tuesday, May 7, 2024
- Advertisement -

హీరో రాజ‌శేఖ‌ర్‌తో సినిమానా? అయితే డేట్స్ ఖాళీ లేవు…!

- Advertisement -

కాజ‌ల్ అగ‌ర్వాల్ ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 10 సంవ‌త్స‌రాలు దాటిని ఇప్ప‌టికి త‌ర‌గ‌ని అందంతో సినిమాలు చేస్తు బిజీగా ఉంది.కాజల్ తాజాగా ఓ సీనియ‌ర్ హీరో ప‌క్క‌న చేయ‌న‌ని చెప్పి షాక్ ఇచ్చింద‌ని స‌మాచారం.పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..సీనియ‌ర్ హీరో రాజ‌శేఖ‌ర్ చాలా కాలం త‌రువాత గ‌రుడ‌వేగ సినిమాతో హిట్ కొట్టిన సంగ‌తి అంద‌రికి తెలిసిందే.మంచి క‌థ కోసం కొంత గ్యాప్ తీసుకున్న రాజ‌శేఖ‌ర్ . ‘అ!’ వంటి ప్రయోగాత్మక చిత్రంతో దర్శకుడిగా తన సత్తా చాటుకున్న ప్రశాంత్ వర్మతో త‌న త‌దుప‌రి సినిమాను ఎనౌన్స్ చేశాడు.

ఈ సినిమాలో హీరోయిన్‌గా కాజ‌ల్‌ను సంప్ర‌దిస్తే…హీరో ఎవ‌ర‌ని అడిగి…హీరో రాజ‌శేఖ‌ర్ అని తెలిశాక డేట్స్ ఖాళీ లేవ‌ని చెప్పి సినిమా నుండి త‌ప్పుకుంద‌ని స‌మాచారం.సీనియ‌ర్ హీరోతో సినిమాలు చేస్తే యువ హీరోల ప‌క్క‌న సినిమాలు రావ‌ని కాజ‌ల్ ఇలా చేసింద‌ని కొంద‌రు చెబుతున్నారు.కాని చిరంజీవితో ఖైదీ 150 మూవీ చేసిన‌ప్పుడు అత‌ను సీనియ‌ర్ అని గుర్తుకు రాలేదా అని కాజ‌ల్‌ను ప్ర‌శ్నిస్తున్నారు.చిరంజీవితో పొలిస్తే రాజ‌శేఖ‌ర్ వ‌య‌స్సు త‌క్కువే మ‌రి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -