Tuesday, May 7, 2024
- Advertisement -

శ‌ర్వానంద్‌తో రొమాన్స్‌కు రెడీ అవుతున్న కాజ‌ల్‌

- Advertisement -

హీరోలు లాగా హీరోయిన్ల‌కు ఎక్కువ కాలం కొన‌సాగ‌లేరు.ఒక‌ప్పుడు హీరోయిన్లకు ఎక్కువ కాలంపాటు కొన‌సాగేవారు.ఒకప్పుడు హీరోయిన్లుగా చేసిన వారు ఇప్పుడు క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌లుగా మారుతున్న సంగ‌తి తెలిసిందే.మ‌రి అలాంటి గ్లామ‌ర్ ఫీల్డ్‌లో ప‌ది సంవ‌త్సారాలుకు పైగా హీరోయిన్‌గా కొన‌సాగుతుంది అంటే మాములు విష‌యం కాదు.హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్ ల‌క్ష్మీ క‌ల్యాణం సినిమాతో ఇండ‌స్ట్రీకి పరిచియం అయింది. ఈ సినిమా వ‌చ్చి ప‌ది సంవ‌త్సారాలు దాటింది.ఇప్ప‌టికి వ‌ర‌స సినిమాలు చేస్తు బిజీగా ఉంది కాజ‌ల్‌.

మ‌హేశ్‌బాబు,ప‌వ‌న్,ఎన్టీఆర్,ప్ర‌భాస్‌,అల్లు అర్జున్‌,రామ్ చ‌ర‌ణ్‌,ర‌వితేజ ఇలా టాలీవుడ్ స్టార్స్ అంద‌రితోను న‌టించింది కాజ‌ల్ .ఈ త‌రం హీరోయిన్ల‌లో మెగాస్టార్ చిరంజీవితో న‌టించే అదృష్టం కూడా ఆమెకే దక్కింది.ప్ర‌స్తుతం బెల్లంకొండ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేస్తుంది కాజ‌ల్‌.తాజాగా ఆమె మ‌రో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం.సుధీర్ వర్మ దర్శకత్వంలో యంగ్ హీరో శ‌ర్వానంద్ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా కాజ‌ల్ అగర్వాల్‌ను తీసుకున్నార‌ని తెలుస్తుంది.ఈ సినిమాలో మ‌రో హీరోయిన్‌గా హ‌లో బ్యూటీ క‌ల్యాణీ ప్రియ‌ద‌ర్శ‌న్ న‌టిస్తుంది.ఈ సినిమాలో కాజల్ ఒక డాక్టర్ పాత్రలో కనిపిస్తుందని సమాచారం.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -