Monday, May 20, 2024
- Advertisement -

వృద్ధుడిగా కనిపించనున్న నాని

- Advertisement -

వ‌రస సినిమాలు చేస్తు బిజీగా ఉన్నాడు న్యాచుర‌ల్ స్టార్ నాని.కృష్టార్జున యుద్దం ఫ్లాప్ కావ‌డంతో చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నాడు నాని.వైవిధ్యభరితమైన క‌థ‌ల‌ను ఎంచుకుంటు త‌న కెరీర్‌ను మ‌లుచుకుంటున్నాడు. ప్రస్తుతం ఆయన ఆదిత్య శ్రీరామ్ దర్శకత్వంలో ‘దేవదాస్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సీనియ‌ర్ హీరో నాగ‌ర్జున‌తో క‌లిసి సంద‌డి చేయ‌నున్నాడు నాని.

ఈ సినిమాతో పాటు ‘జెర్సీ మూవీని కూడా లైన్లో పెట్టాడు.క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో నాని మూడు డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు. యువకుడిగా .. మధ్య వయస్కుడిగా .. వృద్ధుడిగా ఆయన మూడు దశలలో తెరపై కనిపించనున్నాడని అంటున్నారు. సెప్టెంబర్ 2వ వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును ఆరంభించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -