Thursday, May 16, 2024
- Advertisement -

మంచు ల‌క్ష్మిని ట‌చ్ చేసే ద‌మ్ముందా..?

- Advertisement -

దేశ‌వ్యాప్తంగా #మీటూ ఉద్య‌యం ఉదృతంగా సాగుతున్న సంగ‌తి తెలిసిందే.బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వ‌ర‌కు మ‌హిళ‌లు త‌మ‌కు ఎదురైన లైంగిక వేధింపుల గురించి ఈ #మీటూ కార్య‌క్ర‌మం ద్వారా బ‌హిరంగంగానే వెల్ల‌డిస్తున్నారు.ఇటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు నటులు, దర్శకులు సినిమాల నుండి తప్పుకుంటున్నారు.అయితే ఇతర ఇండస్ట్రీలతో పోలిస్తే టాలీవుడ్ లో మాత్రం ఈ మీటూ ఎఫెక్ట్ పెద్దగా బయటకి రావడం లేదు. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ లేదని మంచు లక్ష్మీ చేసిన కామెంట్స్‌పై హీరోయిన్ మాధ‌విల‌త  స్పందించారు.

మంచు లక్ష్మీ ల‌క్ష్మీ ఇటువంటి కామెంట్స్ చేసి ఉండ‌కూడ‌ద‌ని ఆమె మాధ‌విల‌త తెలిపింది.మంచు లక్ష్మిని టచ్ చేసే ధైర్యం ఎవరికి ఉంటుంది..? ఆమె మోహన్ బాబు కూతురు. ఆమె జోలికిపోతే మోహన్ బాబు కొడతాడని లేదా చంపేస్తాడని జనాలకి భయం ఉంటుంది. టాలీవుడ్ లో ఇతర హీరోయిన్లు కాస్టింగ్ కౌచ్ ఇబ్బందిని ఎదుర్కొంటున్నారనే విషయాన్ని మంచు లక్ష్మి అంగీకరించాల్సింది. ఈ విషయంలో స్టార్ హీరోయిన్లు బయటకొచ్చి నిజాలు బయటపెడితే మరో ఐదేళ్ల తరువాతైనా ఇండస్ట్రీలో మార్పు వచ్చే అవకాశం ఉందని తెలిపింది మాధ‌వి ల‌త‌.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -