Friday, May 3, 2024
- Advertisement -

వెంకీ చేయాల్సిన సినిమాను ప్ర‌భాస్ చేస్తున్నాడా?

- Advertisement -

ఒకరు చేయాల్సిన క‌థ‌ను అనేక కార‌ణాల‌తో మ‌రో హీరో చేయ‌డం మ‌నం చాలానే చూశాం.అలాంటిదే ఇప్పుడు ప్రభాస్ కొత్త చిత్రానికి జరగుతోందని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.వెంక‌టేష్‌తో బడ్జెట్ కార‌ణంగా క్యాన్సిల్ అయిన సినిమాను ప్రభాస్‌తో తీస్తున్నారు జిల్‌ ఫేం రాధాకృష్ణ.ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లు మార్పులు ,చేర్పులు చేసినట్లు చేసి మ‌రి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్‌ తెరకెక్కిస్తోంది.

ఈ సినిమా జోనర్‌ ఏమిటన్నదానిపై ఓ ఆసక్తికరమైన వార్త ప్రచారంలో ఉంది. ఇది జ్యోతిష్య శాస్త్రం, హస్త సాముద్రికం నేపథ్యంలో నడిచే కథ అని తెలుస్తోంది. 1970 కాలంలో జరిగినట్టుగా చూపిస్తారట. ఈ కాలానికి ముడిపెడతారట. అలాగే ఇదో థ్రిల్లర్‌ అని, యాక్షన్‌ అంశాలకూ ప్రాధాన్యం ఉందని తెలుస్తోంది.ఇలా వెంకీ చేయాల్సిన సినిమాను ప్ర‌భాస్ చేస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -