Wednesday, May 15, 2024
- Advertisement -

అవున్రా నేను పొట్టిదాన్నే …అయితే ఏంటీ?

- Advertisement -

సోష‌ల్ మీడియాలో ఎవ‌రినైన ఏమైన అడ‌గ‌వ‌చ్చు ధీమాగా ఉంటారు కొంద‌రు.తాజాగా అలాంటి సంఘ‌ట‌నే హీరోయిన్ మాధ‌వి ల‌త‌కు ఎదురైంది. తాను పొట్టిగా ఉన్నానని కొందరు విమర్శించడంపై ఫేస్ బుక్ లో ఘాటుగా జవాబిచ్చింది మాధ‌వి ల‌త‌. ఇటీవల శ్రీనగర్ కాలనీలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో మాధవీలత పొల్గొంది. అనంతరం దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ నేపథ్యంలో కొందరు నెటిజన్లు ‘మాధవీలత పొట్టిది’ అంటూ కామెంట్లు పెట్టారు.దీనిపై స్పందించిన మాధివి ల‌త …‘నేను శ్రీనగర్ కాలనీలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నా.

దానికి సంబంధించి ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేశా. అయితే చాలామంది పొట్టిది..పొట్టిది అని కామెంట్లు పెట్టారు. అవునురా బై.. నేను పొట్టిగనే ఉంటా. నీకేమైనా ఎక్కడన్నా నొప్పి వచ్చిందా? నీకేమయినా మాయరోగం వచ్చిందా? నీకేమయినా పోయేకాలం వచ్చిందా? లేదు కదా.మీ అమ్మ, మీ అక్కా, మీ చెల్లి అంతా పొడవుగానే ఉన్నారు కదా. ఇంక హ్యాపీగా ఉండు. నాకు లేనిది మీకున్నందుకు సంతోషించండి. నామీద పడి ఎందుకు ఏడుస్తారు? నేను పొట్టిగా ఉండటం వల్ల ఎవడికైనా నొప్పివస్తే చెప్పండి అంటూ నెటిజ‌న్లుపైచ మండిప‌డింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -