Monday, May 13, 2024
- Advertisement -

మెగా హీరో స‌ర‌స‌న ఛాన్స్ కొట్టేసిన హీరోయిన్ మెహ్రిరిన్‌..

- Advertisement -

తెలుగు తెరపై గ్లామర్ పరంగా మంచి మార్కులు కొట్టేసిన కథానాయికలలో మెహ్రీన్ ఒకరు. వరుసగా మూడు సక్సెస్ లను అందుకున్న మెహ్రీన్, ఆ తరువాత రెండు పరాజయాలను చవిచూడాల్సి వచ్చింది. దాంతో ఆమె కెరియర్ గ్రాఫ్ కొంచెం స్లో అయినా .. వెంటనే పుంజుకుంటోంది.

తాజాగా ఆమెక మెగా హీరో స‌ర‌స‌న నటించే ఛాన్స్ కొట్టేసింది. అనిల్ రావిపూడి సినిమాలో అవకాశాన్ని దక్కించుకుంది. గతంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెహ్రీన్ ‘రాజా ది గ్రేట్’ చేయగా, అది ఘన విజయాన్ని సాధించింది. అది సెంటిమెంట్ గా తీసుకున్నాడో ఏమో మళ్లీ తన సినిమాలో ఆమెకి అనిల్ రావిపూడి అవకాశం ఇచ్చాడు.

‘ఎఫ్ 2’ పేరుతో వెంకటేశ్ .. వరుణ్ తేజ్ లతో ఆయన ఒక మల్టీస్టారర్ చేస్తున్నాడు. ఈ సినిమాలో వెంకీ సరసన తమన్నాను తీసుకున్న ఆయన, వరుణ్ తేజ్ జోడీగా మెహ్రీన్ ఎంపిక చేసుకున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -