- Advertisement -
షూటింగ్ స్పాట్ నుంచి నటి అదృశ్యం కావడం కలకలం రేపింది.తమిళ సినిమా ఇండస్ట్రీలో అవళుక్కెన్న అళగియ ముగం పేరుతో ఒక సినిమా తీస్తున్నారు. ఇందులో అనుపమా ప్రకాష్ అనే ముద్దుగుమ్మ నటిస్తున్నారు. కొడై కెనాల్ ప్రాంతంలో పాటకు సంబంధించిన షూటింగ్ జరుగుతున్న వేళ, అనూహ్యంగా అనుపమా మిస్ అయ్యారు.
దీంతో కంగారు పడిన చిత్ర నిర్మాత ఆమె ఎక్కడికి వెళ్లిందని వాకబు చేయటం మొదలు పెట్టారు.కొన్ని గంటల తర్వాత ఆమె సేఫ్ గా ఉందని తెలిసి ఊపిరి పిల్చుకున్నారు.సడన్‌గా ఆమె షూటింగ్ నుంచి ఎక్కడి వెళ్లిందని అడగితే,ఆమె నుంచి షాకింగ్ సమాధానం వచ్చింది.కొండ ప్రాంతంలో జరిగిన షూటింగ్ తో భయాందోళనలకు గురైన అనుపమా.. ఎవరికి చెప్పకుండా షూటింగ్ నుంచి వెళ్లిపోయానని చెప్పడంతో చిత్ర నిర్మాత షాక్ గురైయ్యారట.