Saturday, May 4, 2024
- Advertisement -

ఎంగేజ్మెంట్ ర‌ద్దుపై మొద‌టిసారి స్పందించిన ర‌ష్మిక‌

- Advertisement -

ఛ‌లో సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచియ‌మైంది హీరోయిన్ ర‌ష్మిక.ఇక ఆమె తాజాగా న‌టించిన గీతా గోవిందం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సూప‌ర్ హిట్ కావ‌డంతో ఈ భామ‌కు వ‌ర‌స ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి.అయితే ర‌ష్మిక త‌న సినిమాల క‌న్నా వ్య‌క్తిగ‌త కార‌ణ‌ల‌తో నిత్యం వార్త‌ల్లో నిలుస్తుంది.తన కో స్టార్ రక్షిత్ శెట్టిని ప్రేమించి ఎంగేజ్మెంట్ చేసుకున్న రష్మిక అతడితో విడిపోయిందనే వార్తలు గుప్పుమన్నాయి.ఈ విష‌యంపై అప్ప‌ట్లో స్పందించిన ర‌ష్మిక ఇవి రూమ‌ర్లే అని కొట్టిపారేసింది.నా గురించి రక్షిత్‌కు బాగా తెలుసున‌ని ,త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకుంటామ‌ని తెలిపింది ర‌ష్మిక‌.

ఇలా కామెంట్ చేసిన కొన్ని రోజులుకే ర‌ష్మిక-రక్షిత్ శెట్టి పెళ్లి క్యాన్సిల్ అయింద‌ని మ‌ళ్లీ వార్తలు వ‌చ్చాయి.ఈ విషయంపై రష్మిక తల్లి సుమన్ మందన్నా క్లారిటీ ఇస్తూ.. రష్మిక, రక్షిత్ ల మధ్య విబేధాలు రావడంతో వారి ఎంగేజ్మెంట్ ని రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. రక్షిత్ శెట్టి కూడా ఈ విషయంపై మాట్లాడుతూ.. రష్మికని ఎవరూ టార్గెట్ చేయకూడదని, ఆమెని ప్రశాంతంగా ఉండనివ్వండి అంటూ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు.తాజాగా ఈ విష‌యంపై రష్మిక కూడా స్ప‌దించింది.బ్రేకప్ జరిగిన విషయం నిజమే. అయితే దానికి గల కారణాలు సమయం వచ్చినప్పుడు చెబుతా. అప్పటిదాకా అందరూ సహనంతో ఉండాలని’ కోరింది. ప్రస్తుతం ఆమె నటించిన ‘దేవదాస్’ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -