Saturday, May 4, 2024
- Advertisement -

మొన్న జ‌గ్గారెడ్డి.. నిన్న గండ్ర‌.. నేడు రేవంత్‌రెడ్డి… రేపు చంద్ర‌బాబేనా..?

- Advertisement -

వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌ళ్ళీ అధికారంలోకి రావ‌టానికి తెలంగాణా రాష్ట్ర స‌మితి చీఫ్ పెద్ద మాస్ట‌ర్ ప్లానే వేసిన‌ట్లు తెలుస్తోంది. ఎన్నిక‌ల ఏర్పాట్ల‌కు ఈసీ అధికారులు చ‌క‌చ‌కా ఏర్ప‌ట్ల‌లో నిమ‌గ్న‌మై ఉంటే మ‌రో వైపు రాజ‌కీయ పార్టీలు ఎన్నిక‌ల ప్ర‌చారంతో పొలిటిక‌ల్ హీట్ పెంచారు. టీఆర్ఎస్.. ప్ర‌తిప‌క్ష నాయ‌కుల‌ను అష్ట‌దిగ్బధ‌నం చేస్తోంది.

ప్ర‌తిప‌క్ష పార్టీలో బ‌ల‌మైన నేత‌ల‌పైకి పోలీసుల‌ను ఉసిగొల్ప‌డం, పాత కేసుల్నీ తెర‌పైకి తీసుకురావ‌డంతో ప్ర‌తిప‌క్ష‌ పార్టీల్లో అల‌జ‌డి మొద‌ల‌య్యింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గ్యారెంటీగా గెలుస్తార‌నో లేక‌పోతే గ‌ట్టి పోటీ ఇచ్చే నేత‌ల‌నో అనుకున్న వారిని టిఆర్ఎస్ గుర్తించి ఏదో ఒక మార్గంలో ఎన్నిక‌ల నుండి త‌ప్పించేందుకు ప్లాన్ చేస్తున్న‌ట్లే అంద‌రిలోనూ అనుమానాలు మొద‌ల‌య్యాయి.

మొన్న సంగారెడ్డి కాంగ్రెస్ అభ్య‌ర్ధి తూర్పు జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి (జ‌గ్గారెడ్డి)ని పోలీసులు అరెస్టు చేసిన‌ట్లే, తాజా మాజీ ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి కూడా అరెస్టుకు రంగం సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు క‌న‌బడుతోంది. 2004 ప్రాంతలో నకిలీ ధ్రువపత్రాలతో ముగ్గురిని అమెరికాకు అక్రమంగా పంపించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో మ‌నుషుల అక్ర‌మ ర‌వాణా చేస్తున్నార‌ని చెంచెల్ గూడ జైలుకు త‌ర‌లించారు.

జ‌గ్గారెడ్డి అరెస్ట్ త‌ర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి వంతు వ‌చ్చింది. తెంగాణా కాంగ్రెస్‌లో రేవంత్ ఎంత బల‌మైన నేతో చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు త‌గ్గించాలంటే రేవంత్‌రెడ్డికి చెక్ పెట్ట‌డం మిన‌హా మ‌రోక‌టి లేక‌పోవ‌డంతో జూబ్లీహిల్స్ హౌసింగ్ సోసైటీ  అవకతవకల కేసులో  తాజాగా నోటీసులు జారీ చేశారు పోలీసులు. 2001 జూబ్లీహిల్స్ హౌసింగ్ సోసైటీ కేసు. ఈ నోటీసులపై 15 రోజుల్లో సమాధానం ఇవ్వాలని రేవంత్ ను పోలీసులు కోరారు. పోలీసుల తీరు చూస్తుంటే ఈరోజో రేపో రేవంత్ ను కూడా అరెస్టు చేసేట్లున్నారు.

ఇదే విధంగా వరంగల్ జిల్లాలో గండ్ర కూడా కొరుకుడు పడని కొయ్యే. ఆయ‌ధ చ‌ట్టం క్రింద మాజీ ఎంఎల్ఏ కాంగ్రెస్ నేత గండ్ర వెంక‌ట్ర‌మ‌ణారెడ్డిపైన కూడా పోలీసులు సోమ‌వారం రాత్రి ఆయుధ చ‌ట్టం క్రింద కేసు పెట్టారు.

మ‌రో వైపు రేవంత్ మీదునున్న ఓటుకు నోటు కేసు కూడా బ‌ల‌మైన‌దే. ప‌క్కా ఆధారాల‌తో రేవంత్ రెడ్డి ఏసీబీ అధికారుల‌కు దొరికిపోయారు. వోటుకు నోటు విషయం చర్చ తెలంగాణాలో మొదలయినా ఆంధ్రాలో భూమి కంపిస్తుంది. రేవంత్‌రెడ్డి ఏవైనా పిచ్చివేషాలు వేస్తే ఓటుకు నోటు కేసును మ‌రో సారి తెర‌పైకి తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు అధికార‌పార్టీ.

ఇక రేవంత్ రెడ్డి త‌ర్వాత ఎవ‌రు అనే చ‌ర్చ రెండు రాష్ట్రాల్లో మొద‌ల‌య్యింది. తెలంగాణాలో పాడెమీదునున్న తెలుగుదేశం పార్టీకి కొంతైనా ఊపు తెచ్చేందుకు బాబు కాంగ్రెస్‌, సీపీఐ, కోదండ‌రామ్ పార్టీతో మ‌హాకూట‌మిగా డ్డాయి. ఈ పొత్తు పనిచేయకుండా ఉండాలంటే చంద్రబాబు హైదరాబాద్ వీధుల్లో తిరక్కుండా చేయాలి అంటే ఓటుకు నోటు కేసులో క‌ద‌లిక తీసుకురావ‌డం త‌ప్ప అధికార పార్టీకీ మ‌రొక‌టి లేదు.

అందుకే ఏ క్షణాన్నైనా వోటుకు నోటు కేసు తీసి చంద్రబాబు బెదరగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని టిఆర్ ఎస్ కార్యకర్తులు చాలా ఆనందంగా చర్చించుకుంటున్నారు. చంద్రబాబు అరెస్టు చేసిన ఆశ్చర్యం లేదని చెబుతున్నారు. తర్వాతెవరు? అంటే ఎవరుంటారు…ఒక్కరే, చంద్రబాబు అంటున్నారు.

చంద్రబాబు మీద వోటుకు నోటు కేసులో చర్యలు తీసుకున్నా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే, జగ్గారెడ్డి, గండ్ర ల మీద వి కూడా పాతకేసులే. చంద్రబాబు మీదున్నది కూడా పాత కేసే. పోలీసులకు ఇపుడు సరయిన ఆధారాలు దొరికాయని చెప్పి చంద్రబాబుకు నోటీసులు పంపించడమో, అరెస్టు వారెంట్ జారీ చేయడమో చేస్తే, చంద్రబాబు ఇక ఆకేసులో పడి కొట్టుకుంటూ ఉంటాడు.

మొన్న జ‌గ్గారెడ్డి, ఈరోజు రేవంత్ రెడ్డి, మ‌రి రేప‌టి రోజు లేదా ఎన్నిక‌ల నామినేష‌న్లు వేసేంత‌లో గా ఇంకెంత‌మంది కాంగ్రెస్ నేత‌ల‌పై టిఆర్ఎస్ గురిపెట్టిందో చూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -