Monday, June 17, 2024
- Advertisement -

100 కోట్ల హీరోయిన్‌గా స‌మంత రికార్డు

- Advertisement -

హీరోయిన్ స‌మంత గురించి మనం ఇప్పుడు ప్ర‌త్యేకంగా చెప్పుకోవాడినికి ఏం లేదు. త‌న న‌ట‌న‌తో,అందంతో తెలుగు ,త‌మిళ భాష‌ల‌లో చాలా మంది ప్రేక్షకుల‌ను సంపాదించుకుంది.హీరో నాగ‌చైత‌న్య‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న త‌రువాత చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తుంది.స‌మంత‌కు ఉన్నా రికార్డు మ‌రో హీరోయిన్‌కు లేదంటే అర్థం చేసుకొవాలి.అంత‌లా ఆమె త‌న న‌ట‌న‌తో అభిమానులను సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో ఎన్నో ఘనవిజయాలను ఆమె సొంతం చేసుకున్నారు.

వాటిలో 100 కోట్ల క్లబ్ లోకి చేరిన సినిమాలు కూడా వున్నాయి. ఆమె చేసిన ’24’ ‘కత్తి’ ‘తెరి’ ‘మెర్సల్’ ‘దూకుడు’ ‘అత్తారింటికి దారేది’ ‘జనతా గ్యారేజ్’ సినిమాలు 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయాయి. తాజాగా వచ్చిన ‘రంగస్థలం’ కూడా చాలా వేగంగా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. సమంత కెరియర్లో 100 కోట్లను కొల్లగొట్టిన 8వ సినిమాగా నిలిచింది.ఈ విధంగా చూసుకుంటే స‌మంత‌కు ఉన్న 100 కోట్ల సినిమాలు మ‌రో హీరోయిన్‌కు లేవు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -