హీరోయిన్ సంగీత తెలుగుతో పాటు తమిల్‌లో కొన్ని సినిమాలు చేసింది.‘ఖడ్గం’, ‘పెళ్లాం ఊరెళితే..’, ‘ఈ అబ్బాయి చాలా మంచోడు’, ‘ఖుషి ఖుషీగా’, ‘సంక్రాంతి’ తదితర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తాజాగా తమిళ్ హీరో విజయ్‌తో తనకున్న అనుబంధాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది సంగీత.విజయ్ రెండో సినిమాలోనో, మూడో సినిమాలోనో నేను ఆయనకు జోడీగా నటించాల్సి ఉంది.
మా అమ్మ ఆ సినిమాతో నన్ను నటిగా పరిచయం చేయాలి అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల నేను ఆ సినిమా చేయలేదు’.నేను డ్యాన్స్ చేసిన ఓ షోకు విజయ్ హాజరయ్యారు. మా స్నేహం అక్కడ మొదలైంది. అప్పట్లో ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండు అని విజయ్ నన్ను అరిచారు. నాపై ఏవైనా వదంతులు రాస్తే.. ముందు నాకు ఫోన్ చేసి, నిజం తెలుసుకునే వారు’.
విజయ్ అన్ని చెప్పినా.. నేను క్రిష్‌తో ప్రేమలో పడ్డాను. ఆ విషయం విజయ్‌తో చెప్పా. క్రిష్‌ను చూసిన తర్వాత ఆయన నన్ను ఆప్యాయంగా హత్తుకున్నారు. క్రిష్ అసలు పేరు విజయ్. విజయ్ భార్య పేరు సంగీత. అలా అనుకోకుండా మా జంటల పేర్లు కలిశాయి’ అని ఆమె గుర్తు చేసుకున్నారు.