Monday, May 6, 2024
- Advertisement -

ఆ ద‌ర్శ‌కుడు నా ప్రైవెట్‌ భాగాల‌ను ట‌చ్ చేశాడు – ప్ర‌భాస్ హీరోయిన్‌

- Advertisement -

#మీటూ ప్ర‌స్తుతం ఇండియా మొత్తం దీని గురించే పెద్ద చ‌ర్చ న‌డుస్తుంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వ‌ర‌కు మ‌హిళ‌లు త‌మ‌కు జ‌రిగిన లైంగిక వేధింపుల గురించి బ‌హిరంగంగానే వెల్ల‌డిస్తున్న సంగ‌తి తెలిసిందే.ఇప్ప‌టికే ఈ #మీటూ కార్య‌క్ర‌మంలో భాగంగా చాలామంది పేర్లు బ‌య‌టికి వ‌చ్చాయి.తాజాగా మరో హీరోయిన్ త‌ను ఎదుర్కొన్న వేధింపుల గురించి బ‌య‌ట‌పెట్టింది.హీరోయిన్ సంజన త‌మిళ‌,తెలుగు భాష‌ల‌లో కొన్ని సినిమాలు చేసింది. సంజ‌న‌కు 15 ఏళ్ల వయసులో సినిమా చాన్స్ వచ్చింది. నటించి మళ్లీ చదువు కంటిన్యూ చేయోచ్చనే ఆలోచనతో ఇండస్ట్రీకి వచ్చానని చెప్పుకొచ్చింది. మొదటి అవకాశం కన్నడంలో వచ్చింది. ఆ చిత్ర దర్శకుడు బాలీవుడ్ ‘మర్డర్’ సినిమా చూపించి అదే సినిమాను కన్నడలో రీమేక్ చేస్తున్నట్లు చెప్పారు. అందులో ముద్దు సీన్లు, అశ్లీల సన్నివేశాలు ఎక్కువగా ఉండడంతో నేను దానికి అంగీకరించలేదు.

కన్నడ ఆడియన్స్ కి తగ్గట్లుగా కథ మారుస్తున్నామని చెప్పడంతో ఒక ముద్దు సన్నివేశంలో మాత్రమే నటించడానికి అంగీకరించాను. సినిమా షూటింగ్ కోసం బ్యాంకాక్ వెళ్లాను. అక్కడ నాపై పలు ముద్దు సన్నివేశాలు చిత్రీకరించారు. చాలా అశ్లీల సన్నివేశాలను షూట్ చేశారు. నా శరీరంలోని మర్మ భాగాలను కూడా చిత్రీకరించారు. అలా చిత్రీకరించడానికి నేను ఒప్పుకోకపోతే నీ కెరీర్ నాశనం చేస్తామని బెదిరించారని తెలిపింది సంజ‌న‌.అప్పుడు నాది చిన్న వ‌య‌స్సు కావ‌డం,పైగా ఇండ‌స్ట్రీ కొత్త కావ‌డంతో ఏం చేయ‌లేక‌పోయాన‌ని చెప్పుకొచ్చింది.సంజ‌న‌.ప్ర‌భాస్ హీరోగా చేసిన బుజ్జిగాడు సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా చేసింది సంజ‌న‌.ఆమె ఇప్పుడు స్వ‌ర్ణ‌ఖ‌డ్గం సీరియ‌ల్‌లో కూడా న‌టిస్తుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -