Sunday, May 19, 2024
- Advertisement -

సునీల్ పరువు తీసిన హీరోయిన్లు

- Advertisement -

సునీల్‌కు బ్యాడ్ టైమ్ న‌డుస్తుంది.త‌ను న‌టించిన సినిమాలు పెద్ద‌గా ఆక‌ట్టుకోవ‌డం లేదు.తీసిన ప్ర‌తి సినిమా ప్లాప్ కావ‌డంతో మార్కెట్‌గా కూడా ప‌డిపోయింది.డైరక్టర్లు కూడా సునీల్ వైపు చూడటం మానేశారు. ఇంకా హీరోయిన్లు సంగతి చేప్పే అవ‌స‌రం లేదు.హీరోయిన్లు సునీల్ సినిమా అంటే చాలు పారిపోతున్నారు.ఈ మాట చేప్పింది ఎవ్వరో కాదు సునీల్ డైర‌క్ట‌ర్‌ఎన్.శంకర్. సునీల్ లేటెస్ట్ మూవీ 2-కంట్రీస్. మలయాళంలో సూపర్ హిట్ అయిన సినిమాకు రీమేక్ ఇది. సునీల్ హీరోగా నటించిన ఈ రీమేక్ లో నటించడానికి చాలామంది హీరోయిన్లు ఒప్పుకోలేదట.నిజానికి ‘2 కంట్రీస్’ సినిమాలో హీరోయిన్ పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది.

హీరోను డామినేట్ చేసే క్యారెక్టర్ అది. అలాంటి పాత్రను ఓ స్టార్ హీరోయిన్ చేస్తే బాగుంటుందని దర్శకుడు ఎన్.శంకర్ ఫీలయ్యాడు. అందుకే ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్న కొందరు హీరోయిన్లను సంప్రదించాడట.కానీ సునీల్ హీరో అనేసరికి అతడి సరసన నటించడానికి ఏ ఒక్కరూ ఒప్పుకోలేదట. మరికొందరైతే సునీల్ ను మార్చేసి, మరో హీరోను పెడితే నటిస్తామని ఉచిత సలహాలు కూడా ఇచ్చారట. ఈ విషయాలన్నీ స్వయంగా దర్శకుడే బయటపెట్టాడు.

https://www.youtube.com/watch?v=QPmXTScbmK0

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -