Saturday, May 18, 2024
- Advertisement -

అక్కినేని ఫ్యాన్స్‌కి సూపర్ షాక్……‘రతీదేవి’గా సమంత

- Advertisement -

ఒక టాప్ రేంజ్ హీరోయిన్‌ని ఒక ప్రముఖ ఫ్యామిలీ వారసుడైన హీరో పెళ్ళి చేసుకోవడం కాస్త అరుదైన విషయమే. కానీ నాగచైతన్య మాత్రం సమంతాను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. నాగచైతన్య-సమంతాల ప్రేమ వివాహం బయటపడిన వెంటనే సోషల్ మీడియాలో కొంతమంది సమంతా గురించి నెగిటివ్‌గా కూడా కామెంట్స్ చేశారు. ఇక మన మీడియా కూడా సమంతా గురించి కొంత చెడుగా కూడా ప్రచారం చేసింది. అయినప్పటికీ నాగ్ మాత్రం పెద్ద మనసుతో అలాంటివేమీ పట్టించుకోకుండా నాగచైతన్య-సమంతాల జంటకు పెళ్ళి చేసేశాడు. పెళ్ళికి ముందు ఏంటి అన్న విషయం పక్కన పెడితే పెళ్ళి తర్వాత నుంచీ మాత్రం ఫంక్షన్స్‌కి వస్తున్నప్పుడు కూడా సమంతా డ్రెస్సింగ్ తీరు మొత్తం మారిపోయింది. అందరూ కూడా అక్కినేని కోడలు అయ్యాక సమంతాలో చాలా మార్పు వచ్చింది అన్నారు.

అయితే ఇప్పుడు అలాంటి వాళ్ళందరికీ షాక్ ఇస్తూ సమంతా ‘రతీదేవి’గా దర్శనం ఇవ్వబోతోంది. ఇప్పుడు ఇదే విషయంపై అక్కినేని అభిమానులు సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. విశాల్ హీరోగా వస్తున్న సినిమాలో సమంతా రతీదేవిగా కనిపించబోతోంది. ఆ సినిమాలో సమంతా పేరు రతీదేవి. ఇప్పుడు ఈ పేరు విషయంలోనే అక్కినేని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అగ్రశ్రేణి సినిమా కుటుంబ వారసురాలు అయిన సమంతా ‘రతీదేవి’ అన్న పేరుకు ఎలా ఒప్పుకుంది? సమంతాకు ఆ పేరు గురించి తెలియదా? నాగార్జున అయినా కల్పించుకుని పేరు మార్పిస్తే బాగుండేది కదా అని అక్కినేని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ముందు ముందు ఈ కామెంట్స్ అన్నీ కూడా నాగ్‌కి రీచ్ అవుతాయేమో చూడాలి. అలాగే విశాల్ సినిమా ప్రచారం ఇంకా ఉధృతమై……సినిమా రిలీజ్ ప్రమోషన్స్ టైంకి ఈ రతీదేవి పేరు మారిపోయినా ఆశ్ఛర్యపోవాల్సిన పనిలేదు. అక్కినేని అభిమానులు మాత్రం ప్రస్తుతానికి నాగ్‌కి, చైతన్యకు ట్యాగ్ చేస్తూ రతీదేవి పేరు మార్చాలని సలహాలు ఇస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -