టాలీవుడ్ లో టాప్ హీరోలు ఎవరు అని అడిగితే.. ఎవరికి వారు తమ అభిమాన హీరోనే టాప్ హీరో అంటారు. అయితే ఫ్యాన్స్ ప్రకారం, క్రేజ్ ప్రకారం చూస్తే… టాలీవుడ్ లో టాప్ హీరోల లిస్ట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తప్పక ఉంటారు. ఈ ముగ్గురు టాప్ హీరోలు టాలీవుడ్ ను తమ సినిమాతో శాసిస్తున్నారు అన్నది ఒప్పుకోక తప్పని నిజం.
అయితే ఈ ముగ్గురు హీరోలు వేస్ట్ అని.. వారు బిచ్చగాళ్ల కన్నా వేస్ట్ అంటూ ఘోరంగా అవమానించాడు ఓ డైరెక్టర్. నాగ్ తో కలసి సంకీర్తన, అటుపై కోకిల అనే సినిమాలకు దర్శకత్వం వహించిన గీత కృష్ణ అనే దర్శకుడు తాజాగా ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంటెర్వ్యు లో మాట్లాడుతూ…. ఇటివలే మహేష్ బాబు నటించిన బ్రహ్మోత్సవం సినిమా సీరియల్ కన్నా ఘోరంగా ఉందని ఇలాంటి చిత్రాలు అంత క్రేజ్ ఉన్న హీరోలు ఎలా ఒప్పుకుంటారని మహేష్ ను అవమానిస్తూనే…. పవన్ నటించిన సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమాలో అసలు ఏం ఉందో కూడా అర్ధం కాదు.
అన్ని రోల్స్ ఒక్క హీరోనే చేసినట్లు పరమ బోరింగ్ అన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ , ఎన్టీఆర్ ల సినిమాల కంటే బిచ్చగాడు సినిమా బెటర్ అని వాళ్ళు బిచ్చగాళ్ళ కంటే అధ్వన్నామని ఘోరంగా అవమానించాడు. అయితే ఈ విషయంపై ఆయా హీరోల ఫ్యాన్స్ ఆన్‌లైన్ సైట్స్ లో గీత కృష్ణ విమర్శల కురిపిస్తున్నారు. ఇక ఈ గీత కృష్ణ విషయంకు వస్తే.. దర్శకుడిగా తీసిన సినిమాలు హిట్ అయినా.. నిర్మాతగా చేసిన ఏ సినిమా కూడా హిట్ అయిన పాపన పోలేదు.
Related