Wednesday, May 15, 2024
- Advertisement -

పవన్ తో యామిని భాస్కర్ రొమాన్స్!

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో కాటమ రాయుడు అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ రోజు నుంచి ఈ సినిమా రెండో షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది. ఈ షెడ్యూల్ షూటింగ్ లో 24 నుంచి పవన్ పాల్గొననున్నారు. పవర్ స్టార్ ఫ్యాక్షనిస్ట్ గా నటిస్తున్న ఈ సినిమాని శరత్ మరార్ నిర్మిస్తున్నారు.

అయితే ఈ సినిమాలో పవర్ స్టార్ యాక్షన్ మాత్రమే కాకుండా ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ కూడా చేయనున్నారు. ఓ హీరోయిన్ గా శృతిహాసన్ ఖరారు కాగా.. మరో ప్రియురాలిగా కీచక, టైటానిక్ సినిమాల్లో క్యూట్ గా కనిపించి యువకుల మనసు దోచుకున్న యామిని భాస్కర్ కనిపించనున్నారు. ఈ హీరోయిన్ కూడా త్వరలో షూటింగ్ లో పాల్గొనబోతుంది.

ఈ సినిమాలో పవన్ కి తమ్ముళ్లుగా శర్వానంద్, నవీన్ చంద్ర, విజయ్ దేవరకొండ లు నటిస్తుండగా అనూప్ రూబెన్స్ సంగీత ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. త‌మిళంలో అజిత్ హీరోగా వ‌చ్చిన “వీర‌మ్” సినిమా కథకు రాయల సీమ నేపథ్యాన్ని జోడించి పవన్ అభిమానుల అంచనాలకు మించేలా  “కాట‌మ‌రాయుడు”ని డాలీ తెరకెక్కిస్తున్నారు.

Related

  1. కాటమరాయుడు కోసం పవన్ ఏం చేస్తున్నాడంటే?
  2. పవన్ కళ్యాణ్ అర్ధం చేసుకో
  3. పవన్ కళ్యాణ్ కి సంపూ సపోర్ట్
  4. సూపర్ .. మళ్ళీ హరీష్ శంకర్ తో పవన్ కళ్యాణ్ చిత్రం !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -